ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రభుత్వ రుణాలు ఇప్పిస్తామంటూ మోసం

By

Published : Oct 7, 2020, 12:23 AM IST

సామాన్యుల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని ప్రభుత్వ రుణాలు ఇప్పిస్తామంటూ మోసం చేసిన ముఠాను నెల్లూరు జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.క్యాపిటల్ ట్రీ పేరుతో ఏజెన్సీ ఏర్పాటు చేసిన నిందితులు పలువురి వద్ద నుంచి డబ్బు వసూలు చేశారు.

ప్రభుత్వ రుణాలు ఇప్పిస్తామంటూ మోసం
ప్రభుత్వ రుణాలు ఇప్పిస్తామంటూ మోసం

ప్రభుత్వ రుణాలు ఇప్పిస్తామంటూ అమాయకులను మోసగించిన ఘటన నెల్లూరులో వెలుగు చూసింది. నగరంలోని మిలటరీ కాలనీ సమీపంలో క్యాపిటల్ ట్రీ పేరుతో కొందరు ఏజెన్సీ ఏర్పాటు చేశారు. సామాన్యుల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని ముద్రలోన్, ఇతర ప్రభుత్వ రుణాలు ఇప్పిస్తామని..,అందుకు 6,500 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని అమాయకుల వద్ద నగదు వసూలు చేశారు. ఈ క్రమంలో అనేక మంది డబ్బులు కట్టారు. అయినా రుణాలు రాకపోవడంతో..., మోసపోయామని గ్రహించి ఏజెన్సీ వద్ద బాధితులు ఆందోళన చేపట్టారు. ఏజెన్సీ వద్దకు చేరుకున్న పోలీసులు నిర్వహకులను అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details