ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బిందు, తుంపర్ల సేద్యం ప్రోత్సాహానికి ప్రభుత్వం కృషి' - drip irrigation news

బిందు, తుంపర్ల సేద్యాన్ని మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఉద్యానశాఖ ఓఎస్డీ రమేశ్​ అన్నారు. నెల్లూరు జిల్లాలోని ఏపీఎంఐపీ అధికారులు, పలు డ్రిప్ కంపెనీల ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు.

Department of Horticulture OSD conducts meeting
అధికారులు, డ్రిప్ కంపెనీల ఉద్యోగులతో ఉద్యానశాఖ ఓఎస్డీ రమేశ్ సమావేశం

By

Published : Nov 18, 2020, 7:25 PM IST

నెల్లూరు జిల్లాలోని ఏపీఎంఐపీ అధికారులు, డ్రిప్ కంపెనీల ఉద్యోగులతో ఉద్యానశాఖ ఓఎస్డీ రమేశ్ సమావేశం నిర్వహించారు. బిందు, తుంపర్ల సేద్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు. 2018-19, 2019-20 సంవత్సరాల్లో రైతులకు ఇవ్వకుండా పెండింగ్​లో ఉన్న పరికరాలు వీలైనంత త్వరగా అందించాలని అధికారులకు సూచించారు.

2020 - 21 సంవత్సరానికి రాష్ట్రంలో లక్ష ఎకరాల్లో బిందు, తుంపర్ల సేద్యం చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించామని ఆయన అన్నారు. డ్రిప్ కంపెనీలు, రైతులకు రావాల్సిన రాయితీలకు సంబంధించిన నిధులను ప్రభుత్వం త్వరలో విడుదల చేస్తుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details