వైభవంగా ఆడి కృతిక వేడుకలు - nelore
నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఆడి కృతిక వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని డప్పుల వాయిద్యాల నడుమ ఘనంగా ఊరేగించారు.
వైభవంగా ఆడి కృతిక వేడుకలు
నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఆడి కృతిక వేడుకలకు.. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యం సామి ఆలయం నుంచి 108 వేళాయుధాలతో పుర వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. డప్పుల వాయిద్యాల నడుమ ఊరేగింపు ఘనంగా జరిగింది. మూడు రోజులు ఈ వేడుకలు జరగనున్నాయి.