ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Father killed son: ఆగడాలు భరించలేక..ఆ తండ్రి ఏం చేశాడంటే..! - నెల్లూరులో కుమారుడిని హత్య చేసిన తండ్రి

వ్యసనాలకు దూరంగా ఉండాలని ఎంత చెప్పినా వినలేదు.. ఆ మాటలు పెడచెవిన పెట్టడమే కాకుండా.. మద్యం సేవించి తల్లిదండ్రులతో గొడవలు పెట్టుకునేవాడు. ఈరోజు విచక్షణ కోల్పోయి..తండ్రిపైనే కత్తితో దాడికి యత్నించాడు. ప్రతిఘటించిన తండ్రి.. పక్కనే ఉన్న రోకలిబండతో కుమారుడి తలపై కొట్టాడు..దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది.

FATHER KILLED SON AT NELLORE
కుమారుడి ఆగడాలు భరించలేక రోకలితో హత్య చేసిన తండ్రి

By

Published : Sep 13, 2021, 4:31 PM IST


కుమారుడి ఆగడాలు భరించలేని తండ్రి.. కన్నబిడ్డనే హత్య చేశాడు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని కుడితిపాలెం గ్రామంలో ఈ ఘటన జరిగింది. రౌడిషీటరైన కొడుకు అశోక్.. నిత్యం మద్యం సేవించి తల్లిదండ్రులను వేధించేవాడు. రోజులాగే మద్యం మత్తులో ఇంటికి వచ్చిన అశోక్.. తల్లిదండ్రులతో గొడవకు దిగి.. తండ్రి పెంచలయ్యపై కత్తితో దాడి చేసేందుకు యత్నించాడు. ప్రతిఘటించిన తండ్రి.. పక్కనే ఉన్న రోకలిబండతో కుమారుడి తలపై కొట్టడంతో.. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఇందుకూరుపేట పోలీసులు.. అక్కడకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details