నెల్లూరు జిల్లా రైతులు.. నాసి రకం విత్తనాలబారిన పడ్డారు. నాయుడుపేట మండలం కారుమంచివారి కండిగ రైతులు తీవ్రంగా నష్టపోయారు. మొక్కలు ఎదిగినా కాపు లేకపోడంపై ఆవేదన చెందుతున్నారు. నాయుడుపేట మండలంలో కరవు పరిస్థితుల్లో రైతులు కూరగాయలు సాగు చేస్తున్నారు. ఒక పంచాయతీ పరిధిలో 10 నుంచి 20ఎకరాల విస్తీర్ణంలో.. ఎక్కువగా బెండకాయలు సింగం రకం సాగు చేశారు. విత్తనాలు వేసినప్పటి నుంచి నేటి వరకు పెట్టుబడుల రూపంలో ఎంతో ఖర్చు పెట్టారు. పంట వేసి 60, 70 రోజులవుతున్నా దిగుబడి చేతికి రాలేదు. నాసిరకం విత్తనాలే ఇందుకు కారణమని ఆవేదన చెందుతున్నారు.
కల్తీ విత్తనాలు.. కన్నీరు పెడుతున్న రైతులు - farmers
నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం కారుమంచివారి కండిగలో నకలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంట పెరిగినా... కాపు లేక పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక కన్నీరు పెడుతున్నారు.
కల్తీ విత్తనాలతో... రైతు కంట కన్నీరు