నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలో 60వేల మంది ఉన్నారు. పట్టణంలోని 10 వేల200 ఇళ్ల లోని చెత్తను 5 నుంచి 10 వాహనాలలో తరలిస్తుంటారు. డంపింగ్ యార్డు లేక రహదారుల పక్కనే చెత్తను గుట్టలు గుట్టలుగా పోస్తున్నారు. చెత్తవల్ల పశువులు, పందులు చేరుకుంటున్నాయి. చెత్త వలన ఈగలు, దోమలు పక్కనే పోలాల్లోకి వ్యాపించటంతో సాగుకు కష్టమవుతోంది. దిగుబడి కూడా తగ్గుతోంది. మొక్కల పెంపకం కేంద్రంలోకి పొగ చేరి కూలీలు ఉండలేకపోతున్నారు. మొక్కలు పెంపకానికి ఇబ్బందిగా మారింది. పురపాలక సంఘం అధికారులు చెత్తను సంపదగా చేసేందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని.. వర్మీ కంపోస్టు తయారీ యూనిట్లను ప్రారంభించటంలేదన్నారు.
డంపింగ్ యార్డుతో స్థానికుల వెతలు - nellore
నెల్లూరు జిల్లా నాయుడుపేటలో డంపింగ్ యార్డు వల్ల స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
డంపింగ్ యార్డు