ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెంకయ్య పర్యటనకు ఏర్పాట్లు - venkaiah naidu

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు. సింహపురిని స్మార్ట్‌ సిటిగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

ఏర్పాట్లు పరిశీలిస్తున్న మంత్రి నారాయణ

By

Published : Feb 19, 2019, 2:34 PM IST

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నెల్లూరు పర్యటన ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు. బుధవారం ప్రారంభించనున్న నెక్లెస్‌ రోడ్డు పనులను తనిఖీ చేశారు. నగరానికి వన్నె తెచ్చేలా నెక్లెస్‌ రోడ్డు పనులు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అన్ని హంగులతో తీర్చిదిద్దుతున్న ఈ రోడ్డును బుధవారం సాయంత్రం 4.50 గంటలకు ఉపరాష్ట్రపతి జాతికి అంకితం చేస్తారని చెప్పారు. సింహపురిని స్మార్ట్​సిటిగా తీర్చిదిద్దుతామని ఉద్ఘాటించారు. నగరంలోని 42వ డివిజన్‌లో జరగుతున్న నిర్మాణ పనులను మోటారుసైకిల్‌పై తిరుగుతూ మంత్రి పరిశీలించారు.

ఏర్పాట్లు పరిశీలిస్తున్న మంత్రి నారాయణ

ABOUT THE AUTHOR

...view details