నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ప్రైవేటు టీచర్స్, లెక్చరర్లు నిరసన చేపట్టారు. లాక్డౌన్తో నాలుగు నెలలుగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రైవేటు టీచర్లు, లెక్చరర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి ఆదుకోవాలని ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి రవి కిరణ్ కోరారు. నాలుగు నెలలుగా పాఠశాలలు లేక ప్రైవేటు యాజమాన్యాలు ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించటం లేదని.., కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉందని వాపోయారు.
'ప్రభుత్వమే ఉపాధ్యాయులను ఆదుకోవాలి'
నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో ప్రైవేటు టీచర్లు, లెక్చరర్లు ఆందోళన చేపట్టారు. లాక్డౌన్ కారణంగా కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉందని.. ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వమే ఉపాధ్యాయులను ఆదుకోవాలి
పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులు పండ్ల వ్యాపారాలు, కూలి పనులకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లుగా ఉపాధ్యాయులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ఆదుకోవాలని కోరారు.
ఇదీ చదవండి నెల్లూరులో ఘనంగా వైఎస్సార్ జయంతి