ఇక నుంచి రైతులకు 9 గంటలు పాటు పగటి పూటే విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కళాధర్ రావు వెల్లడించారు. నెల్లూరు జిల్లా విద్యుత్ భవన్లో మాట్లాడిన ఆయన.. దీనికోసం ప్రభుత్వం రూ.500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పగలు, రాత్రి కలిపి 9 గంటల విద్యుత్ రైతులకు సరఫరా చేస్తున్నామన్నారు. పగటి పూటే రైతులకు 9 గంటల విద్యుత్ ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. జూన్ నాటికి పనులు పూర్తి చేసి, రైతులకు పూర్తి స్థాయిలో కరెంటు ఇస్తామని తెలిపారు.
ఇక పగటిపూటే రైతులకు 9 గంటల విద్యుత్..! - పగటి పూట రైతులకు కరెంట్ సరఫరా
రైతులకు పగటి పూటే 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అధికారులు వెల్లడించారు. దీనికోసం కసరత్తు మొదలు పెట్టినట్లు వివరించారు. జూన్ నాటికి పనులు పూర్తి చేసి అన్నదాతలకు పూర్తి స్థాయిలో కరెంటు ఇస్తామని తెలిపారు.
పగటిపూటే రైతులకు 9 గంటల విద్యుత్