ఐపీఎల్ మ్యాచ్‌లలో బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఓ ముఠాను నెల్లూరు జిల్లా కోవూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని స్టౌబిడి కాలనీ దగ్గర క్రికెట్ బెట్టింగ్ జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఓ గది అద్దెకు తీసుకుని బెట్టింగ్ పెడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద 60వేల రూపాయల నగదు, పది సెల్ ఫోన్లు, ఓ టీవీ, పలు ఏ.టి.యం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ ముఠాలో ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కోవూరులో క్రిెకెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.. - కోవూరు నేర వార్తలు
నెల్లూరు జిల్లా కోవూరు పోలీసులు.. క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు. వారి వద్ద రూ.60వేల రూపాయల నగదుతో పాటు ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
cricket betting people arrest in kovur nellore district