Nellore Central Jail: నెల్లూరు సెంట్రల్ జైల్లో ఖైదీల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారంటూ పౌర హక్కుల సంఘం ఆందోళన చేపట్టింది. కలెక్టర్ కార్యాలయం ఎదుట పౌర హక్కు సంఘం నేతలు ధర్నా నిర్వహించారు. ఖైదీల పట్ల జైలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2013 - 2020 మధ్యకాలంలో వెంకటేశ్వర్లు అనే ఖైదీ పట్ల మానవ సమాజం తలదించుకునేలా వ్యవహరించారని.. ఖైదీలు, కుటుంబ సభ్యుల సంక్షేమ సమితి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. మలద్వారంలో లాఠీ చొప్పించి చిత్రహింసలకు గురి చేశారన్నారు. ఈ ఘటనపై విచారణ జరిగినా.. కేసు మాత్రం నమోదు చేయలేదని అన్నారు. ఖైదీని వేధించిన అధికారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
'ఖైదీల పట్ల హింసాత్మకంగా ప్రవర్తించిన.. జైలు అధికారులపై చర్యలేవి'
Nellore Central Jail: నెల్లూరు సెంట్రల్ జైలు అధికారులు మానవ సమాజం తలిదించుకునేలా వ్యవహరించారని ఖైదీలు, కుటుంబ సభ్యుల సంక్షేమ సమితి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. అధికారుల తీరుపై విచారణ చేపట్టిన చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. ఖైదీల పట్ల జైలు అధికారులు చిత్రహింసలకు పాల్పడుతున్నారని.. గతంలో ఖైదీ పట్ల అధికారులు వ్యవహరించిన తీరును గుర్తు చేశారు.
నెల్లూరు సెంట్రల్ జైలు