ఆగిన చంద్రయాన్ ప్రయోగం - gslv
చంద్రయాన్ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసుకున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగాన్ని వాయిదా వేసింది. ప్రయోగానికి మరో 56 నిమిషాలు ఉందనగా కౌండౌన్ నిలిపివేసింది ఇస్రో.
ప్రస్తుతం ఇస్రో సాంకేతిక సమస్య ఎక్కడ ఏర్పడిందో ఏ విధంగా ఏర్పడిందో వంటి విషయాలను విశ్లేషించుకుంటుంది. ప్రయోగాన్ని మరలా ఎప్పడు ప్రారంభిస్తారనే విషయంపై ఇంకా ఇస్రో స్పష్టత ఇవ్వలేదు. సాంకేతిక సమస్యను పరిష్కరించిన తరువాతే తదుపరి వివరాలు తెలియజేసే అవకాశం ఉంది. ప్రస్తుతం జీఎస్ ఎల్వీ మార్క్ 3 లో మూడంచెలుగా నింపిన ఇంధనాన్ని పూర్తిగా తోడేసి, వాహక నౌకను వెహికల్ అసెంబ్లీ బిల్డింగుకు తరలించి అక్కడ పూర్తిగా పరిశోధనలు చేస్తారు. ఇదంతా జరగటానికి కనీసం పదిరోజులకు పైనే పడుతుందని అంచనా వేస్తున్నారు.