భవిష్యత్లో జరిగే ఎన్నికలనైనా ప్రశాంతంగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని భాజపా నేత, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో హింస జరగడం బాధాకరమని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికలనైనా ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని కోరారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై ఇష్టానుసారంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ తీసుకునేందుకు గతంలో అంగీకరించి, ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
'పంచాయతీ ఎన్నికల్లో హింస జరగడం బాధాకరం' - నెల్లూరులో సమావేశం
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో హింస జరగడం బాధాకరమని భాజపా నేత వాకాటి నారాయణరెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా విజయం సాధిస్తుందని నారాయణరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
భాజపా నేత వాకాటి నారాయణరెడ్డి