ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విదేశీ పక్షుల పరిరక్షణకై 9న నేలపట్టులో ప్రత్యేక అవగాహన సదస్సు

ఉత్తరాది రాష్ట్రాల్లో బర్డ్​ ఫ్లూ విజృభిస్తుండటంతో నెల్లూరు జిల్లా అటవీ, పశుసంవర్ధక శాఖలు అప్రమత్తమయ్యాయి. ఏటా సుమారు 50 వేలకు పైగా విదేశీ పక్షులు సెప్టెంబర్​లో జిల్లాకు వస్తాయి. ప్రస్తుతం ఇవన్నీ సంతానోత్పత్తి చేస్తున్నాయి. బర్డ్​ ఫ్లూ ఉద్ధృతి దృష్ట్యా ఈనెల 9న నేలపట్టులో ప్రత్యేక అవగాహన సదస్సు ఏర్పాటు చేయనున్నారు.

By

Published : Jan 8, 2021, 1:08 PM IST

bird flu awareness at nelapattu sanctuary
నేలపట్టులో ప్రత్యేక అవగాహన సదస్సు

దేశంలో వేగంగా విజృంభిస్తన్న బర్డ్ ప్లూతో విదేశాల నుంచి వచ్చిన పక్షులకు ఇబ్బందులు ఏర్పడనున్నాయి. దీంతో వలస పక్షికి వణుకు తప్పడం లేదు. దీనిపై అటవీ పశుసంవర్ధక శాఖ అప్రమత్తమైంది. నెల్లూరు జిల్లా నేలపట్టు పులికాట్ సరస్సుకు ఏటా భారీగా వలన పక్షులు వస్తుంటాయి. బంగ్లాదేశ్, నైజీరియా, సైబీరియా దేశాల నుంచి సెప్టెంబర్ మాసంలో చేరుకుని సంతానోత్పత్తి చేయడం ఆనవాయితీ. అలా ఈఏడాది సుమారు 50వేల పక్షులు జిల్లాకు వచ్చాయి. ప్రస్తుతం సంతానోత్పత్తి చేస్తున్నాయి.

అయితే కేరళ రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బర్డ్ ప్లూ వైరస్ విజృంభిస్తుండటంతో జిల్లాలోని పక్షులపై అధికారులు దృష్టి పెట్టారు. అటవీ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈనెల 9న నేలపట్టులో ప్రత్యేక అవగాహన సదస్సు ఏర్పాటు చేయనున్నారు. అందులో అనారోగ్యంతో ఉన్న పక్షులను ఎలా గుర్తించాలి.. వాటి నమూనాలు ఎలా సేకరించాలి బర్డ్ ప్లూ లక్షణాలు ఎలా ఉంటాయనే అంశాలపై వివరిస్తారు. ఇప్పటికే బైనాక్యూలర్ ద్వారా పక్షుల ఆరోగ్య పరిస్థితిని సిబ్బంది పరిశీలిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details