నెల్లూరులో కొనసాగుతోన్న బంద్ - bandh
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ చేపట్టిన బంద్ నెల్లూరులో కొనసాగుతోంది. బంద్ కారణంగా విద్యాసంస్థలకు ముందస్తు సెలవు ప్రకటించారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులు స్వల్పంగా తిరుగుతున్నాయి. ఆర్టీసీ బస్టాండ్ వద్ద సిపిఐ నాయకులు ఆందోళన చేపట్టారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ చేపట్టిన బంద్ నెల్లూరులో కొనసాగుతోంది. బంద్ కారణంగా విద్యాసంస్థలకు ముందస్తు సెలవు ప్రకటించారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులు స్వల్పంగా తిరుగుతున్నాయి. ఆర్టీసీ బస్టాండ్ వద్ద సిపిఐ నాయకులు ఆందోళన చేపట్టారు. బస్టాండ్ ఎదుట బైఠాయించి వాహన రాకపోకలను అడ్డుకున్నారు. ప్రత్యేక హోదా తో పాటు రాష్ట్రానికి విభజన హామీలు అమలు చేయాలని నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ లోనైనా రాష్ట్రానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.