నివర్ తుపాన్ మొదలుకావడంతో నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలతో సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. పెన్నా నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు ఆత్మకూరు ఆర్డీఓ సువర్ణమ్మ తెలిపారు. సోమశిల జలాశయంలో ఇప్పటికే పూర్తిస్థాయి నీటిమట్టం నమోదయ్యింది. తుపాను ప్రభావంతో భారీగా వరదలు వస్తే .. జలాశయం నుంచి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. అందువల్ల ముంపు గ్రామాలను ముందుగానే ఖాళీ చేయిస్తున్నారు. కొందరు అధికారులను క్షేత్రస్థాయిలో పరిశీలనకు ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే గ్రామాల్లో ప్రజలకు తుఫాను హెచ్చరికలు జారీ చేశామని ఆమె తెలిపారు . తుపాను తీరం దాటే వరకు ప్రజలంతా బయటికి రాకుండా ఉండాలని... పశువులు జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. పంటపొలాల్లో వెళ్లొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.
' తుపాను తీరం దాటే వరకు ప్రజలు బయటికి రావొద్దు'
నివర్ తుపాను హెచ్చరికలున్నందున నెల్లూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యింది. ఇప్పటికే ముంపు ప్రాంతాలలోని ప్రజలను ముందుగానే ఖాళీ చేయించారు.
నెల్లూరు జిల్లాలో నివర్ తుఫాన్