నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బలో వైకాపాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఓటర్లకు నగదు పంచుతూ పట్టుపడ్డారు. గ్రామంలో ఓటర్లకు డబ్బు పంచుతున్నారంటూ వచ్చిన సమాచారంతో బుచ్చిరెడ్డిపాలెం సీఐ సురేష్‌బాబు తనిఖీలు నిర్వహించారు. సలీం, రామకృష్ణారెడ్డి అనే వ్యక్తులను అదుపులోకి తీసుకుని.. వారివద్ద నుంచి 50 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
నోట్లు పంచుతూ పట్టుబడిన వైకాపా కార్యకర్తలు - వైకాపా
ఓటర్లకు నోట్ల వల వేస్తూ ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. నెల్లూరు జిల్లా జెండాదిబ్బలో గ్రామస్థులకు డబ్బులు పంచుతున్న వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నోట్లు పంచుతూ పట్టుబడిన వైకాపా కార్యకర్తలు