ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇరిగేషన్ స్థలాల్లో పార్టీ కార్యాలయాలా.. చర్యలు తీసుకుంటాం' - anil kumar yadav

నెల్లూరు రామలింగాపురం జల వనరుల శాఖ కార్యాలయాన్ని మంత్రి అనిల్ కుమార్ పరిశీలించారు. సీఎంతో చర్చించి ఇరిగేషన్ స్థలాలు క్రమబద్ధీకరించే చర్యలు తీసుకుంటామన్నారు. లస్కర్ల భర్తీ తర్వలోనే చేపడతామన్నారు.

నెల్లూరులో మంత్రి అనిల్ పర్యటన

By

Published : Aug 21, 2019, 4:56 PM IST

నెల్లూరులో మంత్రి అనిల్ పర్యటన
ముఖ్యమంత్రి జగన్​తో చర్చించి ఇరిగేషన్ స్థలాల క్రమబద్ధీకరణ చర్యలు తీసుకుంటామని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. నెల్లూరు రామలింగాపురం జలవనరులశాఖ కార్యాలయాన్ని మంత్రి పరిశీలించారు. అమరావతి, మంగళగిరిల్లో ఇరిగేషన్ స్థలాలను తక్కువ లీజుతో తీసుకుని ఓ రాజకీయ పార్టీ భవనాలు నిర్మించిందని మంత్రి తెలిపారు. జల వనరుల శాఖ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉంటుంటే... ఖరీదైన స్థలాలను మాత్రం కొందరు తక్కువ ధరకే లీజుకు తీసుకున్నారని ఆరోపించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రితో చర్చించి అవసరమైన చర్యలు చేపడుతామన్నారు. నెల్లూరు ఇరిగేషన్ నూతన కార్యాలయం భవనాన్ని నాలుగున్నర కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించేందుకు ప్రతిపాదన సిద్ధం చేస్తున్నామని మంత్రి చెప్పారు. త్వరలోనే లస్కర్ల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు.

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details