అన్ని సామాజికవర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేయడం అభినందనీయమని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్ రెడ్డి నివాసానికి వచ్చిన ఆయన...వైకాపా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం రిజర్వేషన్లు కల్పించడం అభినందనీయమన్నారు. బీసీల సంక్షేమం కోసం 15 వేల కోట్లు బడ్జెట్లో కేటాయించడం జరిగిందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు అందించటం, అన్ని సామాజికవర్గాలతో పాటు బ్రాహ్మణ సామాజిక వర్గానికి పెద్దపీట వేయటం హర్షించదగ్గ విషయమన్నారు.
అన్ని వర్గాల అభ్యున్నతే జగన్ లక్ష్యం : కోన - jagan
ముఖ్యమంత్రి జగన్ అన్ని సామాజిక వర్గాల అభ్యున్నతికి పాటు పడుతున్నారని ఉప సభాపతి కోన రఘుపతి కొనియాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రజాసంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
ఉపసభాపతి