నెల్లూరు జిల్లాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నగరంలోని వాడవాడలా కొలువైన గణనాథులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. వివిధ రూపాల్లో కొలువైన వినాయక విగ్రహాలను దర్శించుకొన్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కాపువీధి, ట్రంక్ రోడ్డు, చిన్నబజార్, బాలాజీ నగర్, వేదాయపాళెం, అయ్యప్పగుడి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన భారీ గణనాథులు భక్తులను ఆకుట్టుకుంటున్నాయి. పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా నగరంలో విగ్రహాలను ఏర్పాటు చేశారు. కనక మహాల్ సెంటర్ వద్ద సీఎంఆర్ షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో 200 కేజీల పసుపు కొమ్ములతో కొలువుదీరిన లంబోదరుడి విగ్రహం అలరిస్తోంది. ట్రంక్ రోడ్లో కొబ్బరిపీచు, థర్మకోల్ను ఉపయోగించి టెంకాయలతో ఏర్పాటు చేసిన వినాయకుడిని భక్తులు ఆసక్తిగా తిలకిస్తూ...తమ ఇష్టదైవాన్ని ఘనంగా పూజిస్తున్నారు.
ప్రత్యేక ఆకర్షణగా పసుపు కొమ్ముల గణపతి - nellor
వాడవాడలా ఏర్పాటు చేసిన గణనాథులతో నెల్లూరు పట్టణంలో ఆధ్యాత్శిక శోభ సంతరించుకుంది. విభిన్న ఆకృతులతో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. కనక మహాల్ వద్ద 200 కేజీల పసుపు కొమ్ములతో ఏర్పాటు చేసిన లంబోదరుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు.
ప్రత్యేక ఆకర్షణగా పసుపుకొమ్ముల గణపతి