ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బండరాయితో మోది వ్యక్తి దారుణ హత్య - man brutally murdered

ఓ యవకుణ్ణి బండరాయితో మోది అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన నెల్లూరు జిల్లా బ్రహ్మణకాక్రలో చోటు చేసుకుంది. జొన్న పొలాల్లో హత్యకు గురైన వ్యక్తిని గుర్తించిన స్థానికులు పోలీసులు సమాచారం అందించారు.

వ్యక్తి దారుణ హత్య

By

Published : Aug 24, 2019, 12:04 AM IST

వ్యక్తి దారుణ హత్య

నెల్లూరు జిల్లా చామదల గ్రామానికి చెందిన మెద్దు నాగార్జున బేల్ధారి పని చేసుకుంటూ...జీవనం సాగిస్తున్నాడు. గురువారం ఉదయం గ్రామంలో ఒకరి వద్ద వెయ్యి అప్పుగా తీసుకొని మద్యం సేవించాడు. అనంతరం కనిపించకుండా పోవటంతో మృతుడు తల్లిదండ్రులు తమ కుమార్తె వద్దకు ఉంటాడని భావించారు. కానీ మర్నాడు ఉదయం జొన్న పొలంలో శవమై కనిపించటాన్ని గ్రామస్తులు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. గొంతు నులిమి హత్యచేయటంతో పాటు బండరాయితో మోదినట్లుగా ఆనవాళ్లు ఉండటంతో హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హతుడికి గతంలో ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా ? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details