నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాలలో ఓ దుప్పి.. అనూహ్యంగా శ్రీనివాసులురెడ్డి అనే వ్యక్తి ఇంట్లో ప్రత్యక్షమైంది. గదిలోకి ఆవుదూడ వెళ్లిందని భావించిన కుటుంబ సభ్యులు.. లోపలకి వెళ్తే దుప్పి కనిపించే సరికి అవాక్కయ్యారు. దుప్పిని లోపలే ఉంచి గదికి తాళం వేశారు. ఆత్మకూరు అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అధికారి పిచ్చిరెడ్డి తన బృందంతో వచ్చి.. ఆ దుప్పిని పట్టుకున్నారు.
అడవి నుంచి జనావాసాల్లోకి ప్రవేశించే క్రమంలో దుప్పి గాయాలపాలైంది. చికిత్స చేసిన అధికారులు దాన్ని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. కనిగిరి రిజర్వాయర్ అటవీ ప్రాంతం నుంచి గానీ, నరసింహకొండ అటవీ ప్రాంతం నుంచి గానీ దుప్పి వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.