జూన్ మాసాంతం వచ్చినా చినుకు జాడ లేకపోగా ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో ప్రజలు ఉక్కపోత భరించలేక ఎండ తీవ్రత తట్టుకోలేక విలవిలలాడుతున్నారు. నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలంలో గత ఐదు సంవత్సరాలుగా తీవ్ర వర్షాభావ పరిస్థితి నెలకొంది. వాగులు, వంకలు చెరువులు బీటలు వారాయి. జనం పంటలు లేక వలస బాట పడుతున్నారు. ఈ ఏడాది జూన్ మాసం వచ్చినప్పటికీ.. చినుకు పడిన దాఖలాలు లేవు. దీంతో మండలంలో ఏ గ్రామంలో చూసినా దుర్భిక్ష పరిస్థితే కనిపిస్తోంది. మామిడి, నిమ్మ చెట్లు ఎండుముఖం పట్టాయి. దాంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
500 ఏళ్ల వృక్షాలు మోడువారుతున్నాయి... ఎందుకంటే!? - chirumana
పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వృక్షాలు సైతం ఎండుముఖం పడుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల జంతు, వృక్ష, మానవాళి మనుగడ సాగించడం కష్టంగా మారుతోంది.
భానుడి భగ భగతో మోడులా మారిన 500 ఏళ్ల వృక్షరాజులు
చిరమన గ్రామంలోని దాదాపు 500 ఏళ్ల నాటి చింత చెట్లు సైతం నిలువునా ఎండిపోయాయి. ఒకప్పుడు పచ్చదనం, చింత కాయలతో కళకళలాడుతూ ఉన్న చింత చెట్లు ఇప్పుడు మోడువారిపోయాయి. అటు ఎండను సైతం తప్పించుకోవడానికి వీటి కింద గ్రామస్తులు సేద తీరే వారు. తమ పనులు కూడా ఇక్కడే సాగించేవారు. అయితే పరిస్థితులు ఇందుకు భిన్నంగా మారాయి.
ఇదీ చదవండి...ఓటు వేయలేదని గోడ కట్టేశారు!