TDP Cheif Chandrababu visited Thotapalli project: ''ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా గోదావరి నీళ్లు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు కలిపితే కరవు సమస్య ఉండదు. ఉత్తరాంధ్రలో ఉన్న 13 ప్రాజెక్టులను ఈ వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. తోటపల్లి ప్రాజెక్ట్ తెలుగుదేశం తెచ్చింది కాబట్టే దాని నిర్వహణను గాలికొదిలేశారు. పురుషోత్తపట్నం ప్రాజెక్టును నేను కట్టాననే అక్కసుతోనే దానిని కూడా మూలన పడేశారు. తోటపల్లి ప్రాజెక్టు ద్వారా లక్షా 80వేల ఎకరాలు నీరు పారాల్సి ఉండగా.. కాల్వల మరమ్మతులు లేని కారణంగా సరిపడా నీరందటం లేదు. ప్రాజెక్టుల విషయంలో ఈ జగన్ ప్రభుత్వం పడకేసి.. రివర్స్ గేరులో నడుస్తోంది'' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Chandrababu Projects Tour: 9రోజులు పూర్తి చేసుకున్న చంద్రబాబు యుద్ధభేరి పర్యటన.. 'సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి' పేరుతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 1వ తేదీ నుంచి పది రోజులపాటు పర్యటన ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే 8రోజులు పూర్తి చేసుకున్న చంద్రబాబు యుద్ధభేరి పర్యటన.. నేటితో 9వ రోజుకు చేరుకుంది. ఈ 9వ రోజు పర్యటన ఉమ్మడి విజయనగరం జిల్లాలో కొనసాగింది. నేటి పర్యటనలో పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించారు. అనంతరం ప్రాజెక్టు వద్ద సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. ఆ తర్వాత గరుగుబిల్లి మండలం ఎర్రన్నగుడిలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని.. చంద్రబాబు ప్రసంగించారు.
Chandrababu Reaction on Attempt to Murder Case: నాపైనే దాడి చేసి.. హత్యాయత్నం కేసా..?: చంద్రబాబు
Chandrababu Fire on Minister Peddireddy: మంత్రి పెద్దిరెడ్డిపై చంద్రబాబు ఫైర్.. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీరుపై సంచలన ఆరోపణలు చేశారు. గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా నీళ్లంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూ.6వేల కోట్ల అవినీతికి తెరలేపారని చంద్రబాబుధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఓ వైపు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా ఏడిపిస్తూ.. మరోవైపు పెద్దిరెడ్డి రూ.600 కోట్ల బిల్లులు క్లియర్ చేశారని ఆరోపించారు. పులివెందుల చక్రాయపేట నుండి కదిరి మీదుగా తంబల్లపల్లికి నీటి తరలింపు పేరుతో ముఖ్యమంత్రి జగన్.. మంత్రి పెద్దిరెడ్డికి 5,036 కోట్ల రూపాయలతో పనులు మంజూరు చేశాడని చంద్రబాబు ఆక్షేపించారు. 10శాతం పెండింగ్‌లో ఉన్న హంద్రీనీవా కాలువ పనులు పూర్తి చేయకుండా.. కొత్త కాలువలు తవ్వుతానని పెద్దిరెడ్డి ప్రకటించటం హాస్యాస్పదంగా ఉందని చంద్రబాబు విమర్శించారు.