AKHANDA JYOTHI : పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని పంచముఖేశ్వర స్వామి ఆలయంలో భారీ ప్రమిదను ఏర్పాటు చేశారు. అందులో ఒకేసారి 350 లీటర్ల నూనె పోయొచ్చని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ప్రమిదతో కార్తిక మాసం అంతా జ్యోతిని వెలిగిస్తామని ఆలయ కమిటీ తెలిపింది. బుధవారం సాయంత్రం సనాతన ధర్మపరిషత్తు నిర్వాహకుడు సుబ్బగురువు కార్తిక అఖండ జ్యోతి వెలిగించారు. హైందవ ధర్మసేన, ఆలయ కమిటీ సభ్యులు ప్రమిదలో విప్పనూనె పోశారు.
Big Pramida : సాలూరులోని పంచముఖేశ్వర స్వామి ఆలయంలో భారీ ప్రమిద.. - సాలూరు పంచముఖేశ్వర స్వామి ఆలయం
Huge Pramida : పవిత్రమైన కార్తీకమాస సందర్భంగా సాలూరులోని పంచముఖేశ్వర స్వామి ఆలయంలో భారీ ప్రమిదను ఏర్పాటు చేశారు. ఈ జ్యోతిని కార్తీక నెల మొత్తం వెలిగిస్తామని ఆలయ కమిటీ తెలిపింది.
Huge Pramida