Congress party leaders media conference: పల్నాడు జిల్లా నరసరావుపేట కాంగ్రెస్ కార్యాలయంలో ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు తులసి రెడ్డి మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు తులసి రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఆంధ్రప్రదేశ్‌కు ఒక శని గ్రహంలా తయారైందని ఆరోపించారు. బీజేపీ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని దుయ్యబట్టారు. రాష్ట్రానికి రావాల్సిన అన్ని ప్రాజెక్టులకు బీజేపీ పంగనామాలు పెట్టిందని ఆరోపించారు. బీజేపీ పాలనలో దేశం పూర్తిగా అప్పుల పాలైందని వ్యాఖ్యానించారు. భారతదేశాన్ని బీజేపీ నేతలు అప్పుల భారత్‌గా మిగిల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 13 మంది ప్రధానుల కాలంలో కానన్ని అప్పులు.. ఒక్కసారి పాలించిన బీజేపీ చేయడం దౌర్భాగ్యమని అన్నారు. మోదీ అటు దేశాన్ని ఇటు రాష్ట్రాన్ని కలిపి అమ్మేస్తున్నారని విమర్శించారు. దేశానికి అచ్చె దిన్ కాదు సచ్చే దిన్ వచ్చిందని తెలిపారు. అధే ధోరణిలో రాష్ట్రంలో వైసీపీ పాలన తయారైందని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌కి మంచి రోజులు రావాలి అంటే రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ, వైసీపీ, జనసేనలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. అలాగే మార్గదర్శిపై ఎక్కడా ఒక్క ఖాతాదారుడు కూడా ఫిర్యాదు చేయలేదన్నారు. వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేక వార్తలు రాస్తున్నారనే కారణంతో వైసీపీ ప్రభుత్వం మార్గదర్శిని చిట్ ఫండ్‌ని వేధిస్తోందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి, గన్ కల్చర్ పెరిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈ కార్యక్రమంలో నరసరావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి అలెగ్జాండర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఏపీలో గంజాయి, గన్ కల్చర్ పెరిగిపోయింది: తులసి రెడ్డి - Congress leader Tulsi Reddy comments on Jagan
Congress party leaders media conference: రాష్ట్రానికి రావాల్సిన అన్ని ప్రాజెక్టులకు బీజేపీ పంగనామాలు పెట్టిందని.. మాజీ రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఆరోపించారు. గడిచిన నాలుగేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులప్రదేశ్, మద్యం ప్రదేశ్, గంజాయి ప్రదేశ్‌గా తయారైందని దుయ్యబట్టారు.
నెల్లూరు జిల్లాలో..ఆత్మకూరులో కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి పాల్లొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని కాంగ్రెస్ పార్టీ భవనంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి చేవూరు శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి.. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి పాల్గొన్నారు. మోదీ ప్రభుత్వం రాహుల్ గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేందుకు అనేక కుట్రలు చేస్తోందని.. జిల్లా పార్టీ అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి ఆరోపించారు. రాహుల్ గాంధీ కుటుంబం పార్లమెంటు సభ్యత్వం ప్రధానమంత్రి కోసం పాకులాడే కుటుంబం కాదని అన్నారు. కేంద్రంలో రాహుల్ గాంధీ సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: