పెళ్లికి పెద్దలు ఒప్పుకోరనే భయంతో.. ప్రేమజంట ఆత్మహత్య - పల్నాడు జిల్లా నేర వార్తలు
16:21 May 26
ప్రేమజంట ఆత్మహత్య
రాష్ట్రంలో రోజురోజుకూ ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ప్రేమ దక్కలేదని కొందరు.. ప్రేమలో మోసపోయామని మరి కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజా.. పల్నాడు జిల్లాలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కారంపూడి మండలం మిర్యాల గ్రామానికి చెందిన బాలిన శివనాగిరెడ్డి(25), అదే ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో తమకు పెళ్లి జరిపించాలని అమ్మాయి తల్లిదండ్రులను కోరగా.. చదువు అనంతరం వివాహం జరుపుతామని నమ్మించి.. మాట దాటేశారు. దీంతో.. ప్రేమికులిద్దరూ తమ పెళ్లి జరగదనే నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలోనే.. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రాసేందుకు నర్సరావుపేట వెళ్లిన బాలిక.. ప్రియుడు శివనాగిరెడ్డితో కలిసి ద్విచక్ర వాహనంపై తిరిగి కారంపూడికి బయల్దేరింది. పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామ శివారులో బైక్ ఆపి, పురుగుమందు తాగి ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి: