ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Extra Marital Affair Suicides in AP: 'లాడ్జిలో ప్రేమికుల ఆత్మహత్యాయత్నం'.. 'వాలంటీర్ వేధింపులతో వ్యక్తి బలవన్మరణం' - వివాహేతర సంబంధం తాజా వార్తలు

Extra Marital Affair Suicides in AP: ఓ లాడ్జిలో ప్రేమికులు ఆత్మహత్యకు యత్నించిన ఘటనలో యువతి మృతి చెందగా, యువకుడు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఈ ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. మరో వైపు వైఎస్సార్ జిల్లాలో శివశంకర్ రెడ్డి అనే వ్యక్తి.. అతని భార్య మహిళ సంరక్షణ కార్యదర్శి వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోవండంతో సూసైడ్ నోట్​ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.

Extra_Marital_Affair_Suicides_in_AP
Extra_Marital_Affair_Suicides_in_AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 26, 2023, 12:16 PM IST

Updated : Oct 26, 2023, 12:33 PM IST

Extra Marital Affair Suicides in AP : పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఓ లాడ్జిలో ప్రేమికులు ఆత్మహత్యకు యత్నించిన ఘటనలో యువతి మృతి చెందగా, యువకుడు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పిడుగురాళ్ల పట్టణంలోని కుమ్మరిపాలెంలో షేక్ షబ్బీర్ (38) రెండు అంతస్తుల భవనంలో కింద పోర్షన్​లో జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య, కుమార్తె ఉన్నారు. పై అంతస్తులో నివాసం ఉంటున్న యువతి (23)తో షబ్బీర్​కు పరిచయం ఉంది. పరిచయం కాస్త ప్రేమగా మారింది.

Lovers Suicide Attempt in Lodge in Piduguralla :ఈ సంధర్భంలో యువతికి వేరే వ్యక్తితో పెళ్లికి సంబంధించి గురువారం కుటుంబ సభ్యులు మాట్లాడుకోవాల్సి ఉంది. ఈ క్రమంలోనే షబ్బీర్ ఉదయం పట్టణంలోని ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నాడు. స్థానికంగా ఓ సెల్షాపులో పని చేసే ఆ యువతి బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో లాడ్జికి వచ్చినట్లు సమాచారం. అయితే సాయంత్రం ఇంటికి రాకపోవటంతో యువతి తల్లిదండ్రులు అనుమానించారు. ఆమె పని చేసే దుకాణం, వారి సమీప బంధువుల వద్ద వాకబు చేశారు. ఎక్కడా ఆచూకీ లేక పోవటంతో చేసేది ఏమీ లేక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Murder Mystery In Ambajipeta: తెలంగాణలో మిస్సింగ్ కేసు.. అంబాజీపేటలో వీడిన మిస్టరీ

పోలీసులు ఆమె సెల్ఫోన్ నంబరు ఆధారంగా లాడ్జిలో ఉన్నట్లు కనుగొన్నారు. పోలీసులు వెళ్లే సరికే యువతి ఉరేసుకుని మృతి చెందింది. షబ్బీర్ బ్లేడుతో శరీరంపై గాయాలు చేసుకోవడంతో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతనిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ ఆంజనేయులు పెర్కోన్నారు.

Husband Committed Suicide Because His Wife Had Extra Marital Affair in YSR District :వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో మహిళ సంరక్షణ కార్యదర్శి భర్త శివశంకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. భార్య, ఆమెతో పాటు పని చేసే వాలంటీర్ పబ్బతి శ్రీను, అతని స్నేహితుడు తీట్ల రాజా తన చావుకు కారణమంటూ సూసైడ్ నోట్ రాసి.. శివశంకర్ రెడ్డి చెన్నంరాజుపల్లె వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజుపాలెం మండలం అరకట వేములకు చెందిన శివశంకర్ రెడ్డికి కడపకు చెందిన యువతితో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరు ప్రొద్దుటూరులో నివాసం ఉంటున్నారు. కొన్నాళ్లకు భార్యకు మహిళా సంరక్షణ కార్యదర్శి ఉద్యోగం వచ్చింది. ఈ క్రమంలో ఆమె పబ్బతి శ్రీను అనే వాలంటీర్​తోవివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భర్త, అత్తమామలు మందలించారు. అయినా ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు.

Murder Case Solved: వివాహేతర సంబంధం.. భర్తను హత్య చేయించిన భార్య

దసరా పండుగ రోజు శివశంకర్ రెడ్డి తన భార్యను శివాలయం వద్ద వదిలి పెట్టడానికి ద్విచక్రవాహనంలో వెళ్తుండగా వాలంటీర్ పబ్బతి శ్రీను వారిని అనుసరించారు. అది గమనించిన శివశంకర్ రెడ్డి అతని ఫోటో తీసేందుకు ప్రయత్నించగా భార్య అభ్యంతరం చెప్పారు. అయినా వదలకుండా వెంబడించి వాలంటీర్ ఫోను లాక్కున్నాడు. సెల్ ఫోన్​లోని వాయిస్ రికార్డులు బయటపడతాయని భయంతో తన భార్య, వాలంటీర్ శ్రీను, తీట్ల రాజా తనకు ఫోన్ చేసి తమ వెనుక రాజకీయ నాయకులు ఉన్నారని.. నువ్వు ఎక్కడ ఉన్నా చంపేస్తామని తనను బెదిరించారని శివ శంకర్ రెడ్డి సూసైడ్ నోట్​లో పేర్కొన్నారు.

మృతుడు శివశంకర్ రెడ్డి

ఈ క్రమంలోనే పొట్టిపాడు వద్ద తనను వెంబడించారని.. అందుకే తానే పురుగు మందు తాగి చనిపోతున్నాని శివశంకర్ రెడ్డి సూసైడ్ నోట్​లో రాశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Young Man Brutally Murdered Due to Extra Marital Affair: ఇంటికి పిలిచి యువకుడి దారుణ హత్య.. మహిళతో చనువే కారణమా..?

Last Updated : Oct 26, 2023, 12:33 PM IST

ABOUT THE AUTHOR

...view details