ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాచర్లలో విధ్వంసం.. సినిమాను తలదన్నేలా రావణకాష్ఠం - Attacks by YCP leaders in Macharla

Destruction of YCP Leaders in Machar: మాచర్లలో వైసీపీ నేతలు ముందస్తు పథకం ప్రకారమే.. విధ్వంసానికి దిగినట్లు జరిగిన ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. తెలుగుదేశం నేతలతో పాటు వారికి అండగా నిలిచిన వారిని సైతం.. భయపెట్టి మనోధైర్యం దెబ్బతీయడమే లక్ష్యంగా దాడులు చేశారు. రాడ్లు చేతపట్టి.. ఆటోలెక్కి ఈలలు, కేకలతో హల్‌చల్‌ చేస్తూ వైసీపీ కార్యకర్తలు.. పట్టణంలో మూడు గంటలపాటు భయానక వాతావరణాన్ని సృష్టించారు.

Macharla
మాచర్ల

By

Published : Dec 18, 2022, 8:00 AM IST

మాచర్లలో పథకం ప్రకారమే వైసీపీ నేతల దాడులు

Destruction of YCP Leaders in Machar: మాచర్లలో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై పట్టణ నడిబొడ్డునే అత్యంత కిరాతకంగా..పెద్ద బండ రాళ్లతో మూకదాడులు చేశారు. తెలుగుదేశం నాయకుల ఇళ్లలోకి వెళ్లి పలుగు, పారలతో తలుపులు పగలగొట్టి అక్కడ విధ్వంసం సృష్టించారు. మహిళలని కూడా చూడకుండా ఇళ్ల నుంచి తరిమేశారు.. బంగారం, నగదుతోపాటు ఆస్తుల దోపిడీకి పాల్పడ్డారు.. అప్పటికీ కసి తీరలేదన్నట్లు సామాను తుక్కుతుక్కు చేశారు.

కళ్లెదుటే జరుగుతున్న అరాచకంతో చిన్నపిల్లలు భయకంపితులై స్పృహ తప్పి పడిపోయారు. మహిళలు వణికిపోయారు. ప్రాణాలు అరచేత పట్టుకుని ఇళ్ల నుంచి బయటపడ్డారు.. సినిమాల్ని తలదన్నేలా, రావణకాష్ఠం తలపించేలా 200 మందిపైగా వైసీపీ కార్యకర్తలు గంటల పాటు మాచర్లలో సృష్టించిన అల్లకల్లోలం.. పల్నాడులో మునుపెన్నడూ చూడని భయానక పరిస్థితులకు, వైసీపీ పాలనలో శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పట్టింది..

ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించేందుకు టీడీపీ కార్యాచరణ ప్రకటించడంతో.. వైసీపీ నేతలు కూడా ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు శుక్రవారం నాటి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఫ్యాక్షన్‌ ముసుగులో.. విధ్వంసం సృష్టించాలనే వ్యూహం కన్పిస్తోంది. అందుకు అనుగుణంగానే వైసీపీ కార్యకర్తలతో తొలుత అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు.. జూలకంటి బ్రహ్మారెడ్డిని మాచర్ల నుంచి పంపేశారు. అనంతరం అరగంట వ్యవధిలోనే పట్టణంతోపాటు పరిసర మండలాల వైసీపీ కార్యకర్తలు ఒకచోటకు చేరారు.

టీడీపీ నేత బ్రహ్మారెడ్డికి చెందిన నాలుగు వాహనాలు, ఇతరులకు చెందిన మరో నాలుగు వాహనాలు ధ్వంసం చేశారు. టీడీపీ నేతల ఇళ్లకు వెళ్లి పెద్దఎత్తున విధ్వంసం సృష్టించారు. అక్కడ సామగ్రి ధ్వంసం చేసిన తీరు చూస్తే ఎంతో కసితోనే ఈ పనులన్నీ చేసినట్లు అర్ధమవుతుంది..వైసీపీ నేతలు చేసిన విధ్వంసం నుంచి ఇంకా బయటపడలేకపోతున్నామని..ఇలాంటి పరిస్థితిని ఇప్పటి వరకూ తాము చూడలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details