Fifth Conference of World Telugu Writers: 'స్వభాషను రక్షించుకుందాం.. స్వాభిమానం పెంచుకుందాం' నినాదంతో విజయవాడ సిద్ధార్థ అకాడమీలో ప్రపంచ తెలుగు రచయితల ఐదో మహాసభలు లాంఛనంగా ఆరంభమయ్యాయి. రెండు రోజులపాటు జరిగే ఈ మహాసభలను మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, వివిధ సంఘాల ప్రతినిధులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. సిలికానాంధ్ర ఆధ్వర్యంలో కోటి మాటల కోట, రాజరాజ నరేంద్ర పుస్తకాలను ఆవిష్కరించారు. రచనల ద్వారానే భాషా సంస్కృతులు భవిష్యత్ తరాలకు చేరతాయన్న వెంకయ్యనాయుడు.. మాతృభాషను కాపాడుకునేందుకు ఐదు అంశాలపై అంతా దృష్టి సారించాలని అన్నారు.
"శ్వాస ఎంత ముఖ్యమో..భాష అంత ముఖ్యము.. ప్రజల్లో నిబద్దత లేకుండా భాష పరిరక్షణ, సాహిత్యాభివృద్ధి సాద్యం కాదు.ఇది ఒక ప్రజా ఉద్యమంగా రూపొందాలనేది నా అభివాదం.. ప్రాధమిక విధ్య మాతృ భాషలో ఉండాలి..ఇది తప్పని సరి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది.. పరిపాలన భాషగా మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలి.. పరిపాలన ఎవరికి.. ప్రజలకు కదా.. ప్రజలకు వచ్చిన భాషలో లేకుండా..ఉత్తర్వులు ఇంగ్లీష్‌లో ఇచ్చి .. దయాదాక్షిణాలుగా తెలుగు కాపీ విడుదల చేస్తున్నారు..మారాల్సిన అవసరం ఎంతో ఉంది.. న్యాయవ్యవస్థలో కూడా తీర్పులు, వాదనలు మాతృభాషలో ఉండాలి..ఉన్నత సాంకేతి విద్యను మాతృ భాషలోకి తీసుకురావాలి.. ప్రతీ ఒక్కరూ ముందు ఇంట్లో కుటుంబ సభ్యులతో మాతృభాషలో మాట్లాడాలి.." వెంకయ్యనాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి
ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. తెలుగు భాష పట్ల విద్యార్థుల్లో మక్కువ పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులపైనా ఉందన్నారు. భాషాభిమానం విషయంలో తమిళనాడును చూసి తెలుగువారు నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు. సుసంపన్నమైన తెలుగు భాషను విదేశీయులు ఎంతో ఆదరిస్తున్నా.. స్వరాష్ట్రంలో ఆదరణ తగ్గిపోతుండడం పట్ల భాషాభిమానులు ఆవేదన చెందారు.