Weather Update: గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే వర్షాల నుంచి తేరుకుంటున్న సమయంలో మళ్లీ రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ విభాగం తెలిపింది. అండమాన్ సముద్ర తీరం ఆ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. రాగల 24 గంటల్లో ఇది అల్పపీడనంగా బలపడే సూచనలున్నాయని వాతావరణ విభాగం వెల్లడించింది.
24 గంటల్లో అల్పపీడనం.. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు - Rains In Andhra
Weather in AP: అండమాన్ సముద్ర తీరంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రానున్న 24 గంటల్లో అల్పపీడనం బలపడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 22వ తేదీ నాటికి ఇది మరింత బలపడి వాయుగుండంగా మారుతుందని ఐఎండీ వెల్లడించింది.
రాష్ట్రంలో వర్ష సూచన
ఈ నెల 22వ తేదీ నాటికి ఇది మరితం బలపడి వాయుగుండంగా మారుతుందని ఐఎండీ తెలిపింది. అనంతరం తుపానుగా బలపడేందుకు అవకాశాలు ఉన్నాయని వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ప్రస్తుతం అండమాన్ సముద్రం నుంచి తమిళనాడు వరకూ కోస్తా తీరంపై ఆవరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో చాలాచోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్టు వెల్లడించింది.
ఇవీ చదవండి:
- ఆస్తి కోసం అరాచకం.. మహిళపై గ్యాంగ్ రేప్.. ప్రైవేట్ భాగాల్లో రాడ్డు చొప్పించి మరీ దారుణం
- టీ20 ప్రపంచకప్లో కొత్త టెక్నాలజీ.. ఇక ఫీల్డర్స్ను కనుక్కోవడం వెరీ ఈజీ
- భారత్ ఆటోలతో నేరాలకు చెక్.. బ్రిటన్ పోలీసుల వినూత్న నిర్ణయం