ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతు.. - ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతు

చిన్న చిన్న సరదాలు ఒక్కోసారి ప్రాణాల మీదకు వస్తుంటాయి. అలాంటి ఘటనే ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది. కృష్ణా నదిలో స్నానానికి దిగి, ఇద్దరు యువకులు మునిగిపోయారు. వీరిలో ఒకరిని స్థానికులు బయటకు తీసినప్పటికీ.. ప్రాణాలు దక్కలేదు.

MISSING
MISSING

By

Published : May 30, 2022, 10:09 PM IST

ఇద్దరు స్నేహితులు సరదాగా కృష్ణా నది తీరానికి వెళ్లారు. నదిని, చట్టూ పరిసరాలను చూసిన యువకులు.. ఆ తర్వాత నదిలో ఈత కొట్టాలనుకున్నారు. ఈత రానప్పటికీ నదిలో దిగారు. కాసేపు సరదా గడిపారు. ఆ తర్వాత ప్రమాదశాత్తూ నది ప్రవాహంలో ఇద్దరు యువకులు కొట్టుకుపోయారు. ఈ ఘటనలో ఎన్టీఆర్ జిల్లాలో జరిగింది. విజయవాడ రూరల్ మండలం నిడమానూరు చెందిన కొప్పుల మురళీ కృష్ణ (19), నాగేంద్రబాబు (21) ప్రకాశం బ్యారేజీ సమీపంలో కృష్ణా నదిలోకి దిగారు. స్నానం చేస్తుండగా నీటిలో మునిగిపోయారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు పరిగెత్తుకొచ్చి మురళీ కృష్ణను ఒడ్డుకు చేర్చారు. అనంతరం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆ యువకుడు మృతి చెందాడు. నాగేంద్రబాబు ఆచూకీ మాత్రం లభించలేదు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details