ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కేసుల మాఫీ కోసమే సీఎం మళ్లీ దిల్లీకి పయనం.. టీడీపీ నేతలు - tdp reacted on cm jagan

TDP : కేసుల మాఫీ కోసమే ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి దిల్లీకి పయనమయ్యారని టీడీపీ నేతలు ఆరోపించారు. దిల్లీ వెళ్లటానికి ముందుగా ఏర్పాటు చేసుకున్న పర్యటనను సైతం రద్దు చేసుకుని వెళ్తున్నారని విమర్శించారు.

tdp
టీడీపీ

By

Published : Jan 28, 2023, 12:05 PM IST

MP Rammohan Naidu : ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ వల్లే.. సీఎం జగన్ విశాఖ పర్యటన రద్దు చేసుకొని కేసుల మాఫీ కోసం దిల్లీ పయనమయ్యారని ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. కొందరు పోలీసులు ఖాకీ చొక్కా విప్పి వైసీపీ చొక్కాలు ధరించారని ఆరోపించారు. పోలీసు వ్యవస్థ మొత్తాన్ని తాము తప్పు పట్టడం లేదన్న ఆయన.. కొందరు కళంకిత అధికారుల గురించి మాత్రమే మాట్లాడుతున్నామని తెలిపారు. వైప్లస్ భద్రతలో ఉండే లోకేష్​కు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదేనని స్పష్టంచేశారు. నిన్న పోలీసులు కనిపించలేదు కాబట్టే అచ్చెన్నాయుడు పోలీసుల తీరును తప్పుపట్టారని రామ్మోహన్‌నాయుడు అన్నారు.

వైప్లస్​ కేటగిరి భద్రతలో ఉన్న వ్యక్తి ప్రజలలోకి వచ్చినప్పుడు.. పోలీసుల ఎటువంటి అటంకాలు కలగకుండా చూసుకుని కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలని రామ్మోహన్​ నాయుడు అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్​ పాదయాత్ర చేస్తే పోలీసులు అన్ని విదాల సహకరించి ముందుకు నడిపించారన్నారు. మరీ ఈ రోజు అలా ఎందుకు కనిపించటం లేదని ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే లోకేశ్​ను చూసి జగన్​ భయపడుతున్నారని విమర్శించారు. సీఎం ఎంత భయపడిన సరే రాజ్యంగాన్ని కాపాడాల్సి భాద్యత ఆయనదేనని అన్నారు.

"నిన్న పోలీసుల తీరుపై బాధ కలిగి అచ్చెన్నాయుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ చూస్తు ఉండిపోతే.. పార్టీ అధ్యక్షుడిగా ఆయన స్పందించారు. కట్టడి చేయాల్సింది పోయి పోలీసులు తిరిగి కేసులు పెడుతున్నారు. వైసీపీ పార్టీకీ కార్యకర్తల లాగా కొంతమంది పోలీసులు పనిచేస్తున్నారు. అందరినీ ఉద్దేశ్యించి చేస్తున్న వ్యాఖ్యలు కావు. కొందిరి పోలీసుల తీరు అలా ఉంది." - రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఎంపీ

రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఎంపీ

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details