Lokesh is letter to CM Jagan: చట్టవిరుద్ద నిబంధనలు, నోటీసులతో వైసీపీ ప్రభుత్వం పింఛన్లు తొలగించటం నిలిపివేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ డిమాండ్ చేశారు. పింఛను నయవంచన తగదంటూ.. ముఖ్యమంత్రికి లోకేశ్ లేఖ రాశారు. అధికార పీఠం ఎక్కేందుకు.. పింఛన్ల పెంపు పేరుతో ఇచ్చిన హామీలు మరిచిపోయారా అని ఆక్షేపించారు. గద్దె ఎక్కిన నుంచి.. పింఛన్ల నయవంచనకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు.
తెలుగుదేశం ప్రభుత్వం 200 రూపాయలుగా ఉన్న పింఛను.. 2వేలుకు పెంచిందని గుర్తు చేశారు. వైసీపీ పార్టీ పింఛన్లను 3000 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చి.. మోసగించారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వయోపరిమితి నిబంధనలతో.. సుమారు 18.75 లక్షల పింఛన్లను రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది పింఛన్లను రద్దు చేయాలనుకోవడం చాలా అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.