ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Yanamala: "రాష్ట్రంలో అబద్దాల రేసు.. రైతులకు సహాయం చేస్తే ఆత్మహత్యలెందుకు" - సీఎం జగన్​మోహన్​ రెడ్డి

Yanamala Ramakrishnudu Fired On Jagan: శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు సహాయం చేస్తున్నామంటూ అసత్యాలు చెప్తూ.. మంత్రులు, అధికారులతో కూడా చెప్పిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం నిజంగా సహాయం చేస్తే రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు, అప్పులు ఎందుకు పెరిగాయని ప్రశ్నించాయి.

Etv Bharat
Etv Bharat

By

Published : Jul 8, 2023, 2:01 PM IST

Yanamala Ramakrishnudu On YS Jagan: రాష్ట్రంలో అబద్దాల రేసు కార్యక్రమం నడుస్తోందని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఈ రేసులు ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, అధికారుల మధ్య నడుస్తున్నాయని దుయ్యబట్టారు. నాలుగు సంవత్సరాల్లో కోటి 70 వేల 769 రూపాయలు రైతులకు అందిస్తే.. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు పెరిగాయని ఆయన నిలదీశారు.

ఆత్మహత్యలు మాత్రమే కాకుండా.. రైతులు అప్పుల ఊబిలో ఎందుకు కూరుకుపోయారని మండిపడ్డారు. 4లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గడం సీఎం జగన్​ వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. ధాన్యం ఉత్పాదకత తగ్గడమేనా జగన్​ ఘనతన అని విమర్శించారు. వేరుశనగ ఉత్పాదకత తగ్గడం వైఎస్సార్​సీపీ ప్రభుత్వ వైఫల్యం కాదా అని అన్నారు. వ్యవసాయ వృద్ధి సగానికి దిగజార్చారని.. ఆక్వా కల్చర్​ వృద్ధి 3వ వంతు పతనమైందని మండిపడ్డారు.

దేశంలోనే పరిపాలనలో విఫలమైన ముఖ్యమంత్రి.. సీఎం జగన్​మోహన్​ రెడ్డి అని యనమల విమర్శించారు. తండ్రి జయంతిని రైతు దినోత్సవం పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం అకృత్యమని దుయ్యబట్టారు. ఆ ముసుగులో సొంత మీడియాకు యాడ్స్​ ఇవ్వటం మరో అరాచకమని మండిపడ్డారు. జగన్​మోహన్​ రెడ్డి అబద్దాలకు అంతేలేదని.. అంతటితో సరిపెట్టుకోకుండా మంత్రులతో కూడా అబద్దాలు చెప్పించటం దారుణమని మండిపడ్డారు.

ప్రభుత్వం ఇస్తున్న ప్రకటనల్లో అసత్యాలే ఉన్నాయని.. చివరికి అధికారులతో చెప్పించేది అసత్యాలే అని ఆరోపించారు. రైతులకు ప్రభుత్వం కోట్ల రూపాయల సహాయం అందిస్తే ఆహారధాన్యాల ఉత్పత్తి ఎందుకింత పతనమైందని.. పంటల ఉత్పాదకత ఎందుకింత దిగజారిందని ప్రశ్నించారు. దేశంలో విఫలమైన ముఖ్యమంత్రిగా 17వ స్థానానికి దిగజారిపోయారని విమర్శించారు. ఇటివలే వెల్లడించిన సర్వేలన్నే ఇదే స్పష్టం చేస్తున్నాయని గుర్తు చేశారు.

వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలన్నింటినీ అధోగతి పట్టించరాని మండిపడ్డారు. నాలుగేళ్ల వృద్ధిరేటే అందుకు సాక్షాలని వివరించారు. ముఖ్యమంత్రి దిగజారుడు పనులు మాత్రమే కాకుండా.. రాష్ట్రాన్ని కూడా దిగజార్చరని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని పతనం చేసి రైతులు, పేదల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే ప్రజల్లో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందని అన్నారు. అందుకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ నాయకులకు ఎదురయ్యే పరాభవలే సాక్ష్యమన్నారు. ఎన్నికలు ఎప్పుడెప్పుడూ వస్తాయా.. ఎప్పుడు శని వదిలించుకుందామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని యనమల వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details