'వక్ఫ్ భూముల్ని దోచుకోవాలని చూస్తోన్న జగన్ ప్రభుత్వాన్ని ముస్లిం సమాజం కఠినంగా శిక్షించాలి' TDP Leader MD Sharif on Waqf Board Properties: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ పెద్దలు వక్ఫ్ భూములు, ఆస్తులను చెరబడుతున్నారని.. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎండి షరీఫ్ ఆరోపించారు. నాలుగున్నరేళ్లుగా వక్ఫ్ బోర్డు ఛైర్మన్, సభ్యులను నియమించుకోలేని అసమర్థ స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని ఆయన దుయ్యబట్టారు. ఇన్నాళ్లూ వక్ఫ్ బోర్డు నియామకం గురించి ఆలోచించని జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు తన పార్టీ వారిని, అనర్హుల్ని బోర్డు సభ్యులుగా నియమించడం ముమ్మాటికీ బోర్డు ఆస్తుల దోపిడీ కోసమేనని మండిపడ్డారు.
MD Sharif Comments: వక్ఫ్ బోర్డు భూములు, ఆస్తులు, పాలక మండలి అంశాలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎండి షరీఫ్ మీడియాతో మాట్లాడుతూ..''వక్ఫ్ బోర్డు ఛైర్మన్, సభ్యులను నియమించుకోలేని అసమర్థ స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉంది. గతంలో వేసిన వక్ఫ్ బోర్డు ఏడాది కాలానికే పని చేసింది. మూడేళ్ల నుంచి వక్ఫ్ బోర్డుకు పాలక మండలి లేకుండా చేశారు. పాలక మండలిలో ఒక సభ్యుడి ఎన్నిక కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారు. వక్ఫ్ ఆస్తులను దోచుకోవాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఒక వక్ఫ్ బోర్డు సభ్యుడి ఎంపిక కోసం అధికార పార్టీ నేతలు, మైనారిటీ శాఖ మంత్రి అంజాద్ బాషా రంగంలోకి దిగి ఒత్తిళ్లు చేసి, పైరవీలు నడిపారు'' అని ఆయన అన్నారు.
'వక్ఫ్ బోర్డు భూములను కాజేసే ప్రయత్నం చేస్తున్నారు'
MD Sharif on TDP Govt: ముతవలీ ఇతరుల ఓట్ల కోసం ఒక్కో ఓటుకి రూ.10వేల నుంచి రూ.25వేలు చెల్లించారని.. ఎండి షరీఫ్ ఆరోపించారు. పవిత్రంగా అల్లాహ్ సేవలో ధర్మబద్ధంగా పని చేయాల్సిన వక్ఫ్ బోర్డుని దోపిడీ కోసం జగన్ ప్రభుత్వం అపవిత్రం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు ఏర్పాటు విషయంలో గానీ, ముస్లిం మైనారిటీల సంక్షేమంలో గానీ ఆనాడు టీడీపీ ప్రభుత్వం నిష్పక్షపాతంగా, నిబంధనల ప్రకారం వ్యవహరించిందని ఆయన గుర్తు చేశారు.
వక్ఫ్ భూముల వేలంపై రైతుల ఆందోళన
MD Sharif on Alienation of Waqf Lands: గతంలో అన్యాక్రాంతమైన దాదాపు 300 ఎకరాల వక్ఫ్ భూముల్ని టీడీపీ ప్రభుత్వం కాపాడిందని.. ఎండీ షరీఫ్ పేర్కొన్నారు. వక్ఫ్ భూములు కాజేయాలని చూస్తున్న వైసీపీ నేతలకు సహకరిస్తున్న అధికారుల్ని కచ్చితంగా శిక్షంపబడతారని ఆయన హెచ్చరించారు. టీడీపీ ప్రభుత్వం రాగానే వక్ఫ్ భూములు అన్యాక్రాంతంపై న్యాయ విచారణ జరిపించి.. వక్ఫ్ భూములు కాజేసినవారిని, వారికి సహకరించిన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. ముస్లిం మైనారిటీల పథకాలు రద్దు చేసి.. చివరకు వక్ఫ్ ఆస్తుల్ని కూడా కబళించాలని చూస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ముస్లిం సమాజం కఠినంగా శిక్షించాలని కోరారు.
'బొత్సని సీఎం జగన్ వెనకేసుకొస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారు'