TDP LEADER ANAM : తాడేపల్లి ప్యాలెస్ నుంచే దిల్లీ లిక్కర్ స్కామ్ జరుగుతుందని తెదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. దీనికి కర్త, కర్మ, క్రియ విజయసాయి, జగనే అని విమర్శించారు. తన ధనదాహానికి అల్లుడిని కూడా విజయసాయి బలిచేశారని మండిపడ్డారు. అదాన్ డిస్టిలరీ ద్వారా వేల కోట్లు తరలిస్తున్నారన్న ఆనం.. జగన్ వద్ద ఉన్న రూ.3 లక్షల కోట్ల అవినీతి సొమ్మును ప్రజలకు పంచాలని డిమాండ్ చేశారు. క్విడ్ ప్రోకోలో అరబిందో కంపెనీ సీబీఐ, ఈడీ కేసులను ఎదుర్కొంటోందని.. సీబీఐ దర్యాప్తులో తాడేపల్లి ఖాళీ అయినా ఆశ్చర్యం లేదని ఎద్దేవా చేశారు. ఎథిక్స్ కమిటీ నుంచి విజయసాయిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్‌తో అనుబంధం ఉన్న అరబిందో కుటుంబానిదే అదాన్ డిస్టిలరీస్ అని స్పష్టం చేశారు.
తాడేపల్లి ప్యాలెస్ నుంచే దిల్లీ లిక్కర్ స్కామ్: తెదేపా నేత ఆనం - తెదేపా నేత ఆనం
TDP LEADER ANAM COMMENTS ON CM JAGAN : దిల్లీ లిక్కర్ స్కామ్ పెట్టుబడులన్నీ ఆంధ్రప్రదేశ్‌లో అదాన్ డిస్టిలరీస్ ద్వారా సంపాదించిన దొంగ సొమ్మేనని.. తెలుగుదేశం ఆరోపించింది. ఈమేరకు ఆధారాలు ఉన్నాయని.. ఆ పార్టీ నేత ఆనం వెంకటరమణారెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి జగన్‌తో అనుబంధం ఉన్న అరబిందో కుటుంబానిదే అదాన్ డిస్టిలరీస్ అని స్పష్టం చేశారు.
TDP LEADER ANAM COMMENTS ON CM JAGAN