TDP Bonda Uma on Meeting with Ganta Srinivasa Rao: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణతో భేటీ సాధారణ సమావేశమేనని.. ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. కుటుంబ వ్యవహారాలు, యోగక్షేమాలు మాత్రమే సమావేశంలో చర్చించుకున్నామన్నారు. వైజాగ్‌లో కాపునాడు సమావేశంపై ఎటువంటి చర్చకు రాలేదని తెలిపారు.
ఆ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదు: బొండా ఉమా - ఆంధ్రప్రదేశ్ రాజకీయ వార్తలు
TDP Bonda Uma on Meeting with Ganta Srinivasa Rao: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, భాజపా నేత కన్నాలక్ష్మీనారాయణతో భేటీ సాధారణ సమావేశమేనని.. ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. 70 ఏళ్ల స్వతంత్ర చరిత్రలో కాపు కార్పొరేషన్ పెట్టి కాపులకు న్యాయం చేసింది ఒక్క టీడీపీనే అన్నారు. కాపులు వైసీపీని నమ్మే పరిస్థితి లేదని బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు.
26వ తేదీన వైజాగ్‌లో రంగా వర్ధంతికి సంబంధించి పోస్టర్ మాత్రమే గంటా ఆవిష్కరించారన్నారు. పార్టీ మారే అంశంపై గతంలోనే గంటా ఖండించారని తమతో చెప్పారని బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. కన్నా లక్ష్మీనారాయణ సైతం నాదెండ్ల మనోహర్‌తో ఉన్న సంబంధాలు నేపథ్యంలోనే కలిశామని చెప్పారని అన్నారు. కాపు నాడు అనేది ఏ ఒక్కొరికో సంబంధించిన అంశం కాదని,.. అందిరితో కూడుకున్న అంశమని తెలిపారు. 26వ తేదీన రంగా వర్దంతి కార్యక్రమాలు మాత్రమే నిర్వహిస్తున్నామని, కాపు నాడు సభ మాత్రం కాదని తెలిపారు. కాపులకు న్యాయం చేసింది టీడీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. 70 ఏళ్ల స్వతంత్ర చరిత్రలో కాపు కార్పొరేషన్ పెట్టి కాపులకు న్యాయం చేసింది ఒక్క టీడీపీనేన్నారు. కాపులు వైసీపీని నమ్మే పరిస్థితి లేదని బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు.
ఇవీ చదవండి