ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'బైజూస్'​ ఒప్పందం రద్దు చేసుకోవాలని విద్యార్థి సంఘాల ఆందోళన

AISF Leaders Protest Against Byjus: ప్రముఖ దేశీయ ఎడ్​టెక్​ సంస్థ బైజూస్​పై విద్యార్థి సంఘ నాయకుల ఆందోళనలు రెండో రోజుకు చేరాయి. బైజూస్ కార్యాలయాలపై ఏఐఎస్​ఎఫ్ నాయకులు దాడులు చేసి, ఆ సంస్థతో ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని నిరసనలు చేశారు. బైజూస్ సెంటర్లను ముట్టడించేందుకు ఆందోళనకారులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని స్టేషన్​కు తరలించారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో తొమ్మిదో తరగతి విద్యార్థులు జగనన్న ఇచ్చిన ట్యాబ్​ల్లో గేమ్స్ ఆడుతున్నామంటూ చెబుతున్న వీడియో వైరల్ అయింది.

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 4, 2024, 4:47 PM IST

Published : Jan 4, 2024, 4:47 PM IST

AISF_Leaders_Protest_Against_Byjus
AISF_Leaders_Protest_Against_Byjus

Student Unions Protest Against BYJUs: దేశంలోని అతిపెద్ద ఎడ్​టెక్​ కంపెనీ బైజూస్​తో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ అఖిల భారత విద్యార్థి సంఘం (AISF) నాయకులు ఆందోళనకు దిగారు. బైజూస్ సంస్థ వల్ల వేలాది మంది విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా బైజూస్ సంస్థపై అనేక ఆరోపణలు వస్తుంటే, దివాళా తీసిన సంస్థతో ఒప్పందం వెనుక జగన్ ఆంతర్యమేంటని నాయకులు ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్రంలో విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో విద్యార్థి సంఘ నాయకులు నిరసనలు చేపట్టారు. ట్యాబ్​ల పంపిణీలో కోట్ల రూపాయిల అవినీతి జరిగిందని బైజూస్ కార్యాలయాలపై దాడులకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేయడానికి రూ.3,500 కోట్లతో బైజూస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. విద్యార్థులకు పాఠ్యాంశాలపై సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేయడానికి బైజూస్‌కు రూ.15 వేలు ఫీజు చెల్లించేలా నిబంధన పెట్టారు. కొన్ని రోజుల తర్వాత వారు చెప్పే పాఠాలు విద్యార్థికి అర్థం కాకపోతే ఫీజు వెనక్కి తిరిగి ఇచ్చేలా ఒప్పందం ఉన్నా అమలు చేయడం లేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'బైజూస్'​ ఒప్పందం రద్దు చేసుకోవాలని విద్యార్థి సంఘాల ఆందోళన

"బైజూస్ వల్ల వేలాది మంది విద్యార్థుల జీవితాలను నాశనం అవుతున్నాయి. ప్రభుత్వం బైజూస్​ సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేసే వరకూ మా పోరాటాన్ని ఆపము." -ఆందోళనకారులు

Students Playing Games on Tab: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు పంపిణీ చేసిన బైజూస్ ట్యాబ్​ల వినియోగం ఎంత అన్నది క్షేత్రస్థాయిలో చూస్తే విస్మయం కలగక తప్పదు. విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్​ల్లో పాఠ్యాంశాలను తొలగించి గేములు నిక్షిప్తం చేసి ఆడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం బొరిగివలసలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు తమ ట్యాబులను క్రీడా పరికరాలుగా మార్చుకున్నారు. గేమ్స్ ఆడుతూ చదువులకు దూరం చేస్తున్న ట్యాబ్​​ల పంపిణీపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోరిగవలస పాఠశాలకు చెందిన విద్యార్థులు ట్యాబ్​లో ఫ్రీఫైర్ గేమ్ ఆడుతున్నామంటూ నిర్భీతిగా చెబుతున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

విద్యార్థుల చదువులపై బైజూస్ ట్యాబ్​ల ప్రతికూల ప్రభావం - బాబోయ్ మాకు వద్దంటున్న తల్లిదండ్రులు

గుంటూరులో బైజూస్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన విద్యార్థి, యువజన సంఘాల నేతల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. పోలీసులకు నిరసనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో ఆందోళనకారులను ఈడ్చిపడేసి బలవంతంగా లాక్కెళ్లి వాహనాల్లో పడేశారు. అరెస్టులకు భయపడేది లేదని, బైజూస్​తో ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దు చేసుకునే వరకు పోరాడుతూనే ఉంటామని విద్యార్థి సంఘ నాయకులు తేల్చిచెప్పారు.

బడుల్లో బైజూస్ పాఠాలు.. ఏటా ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు

ABOUT THE AUTHOR

...view details