CEC Call for Special Voters Program : రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి 5న ప్రకటించే ఓటర్ల తుది జాబితా.. రూపకల్పన కోసం ఎన్నికల సంఘం.. ప్రత్యేక ఓటర్లు నమోదు, తనిఖీ కార్యక్రమాలను చేపట్టనుంది. డిసెంబరు 2,3 న ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించింది. తనిఖీ శిబిరాలను రాష్ట్రవ్యాప్తంగా అన్నీ జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాల్లో.. ఏర్పాటు చెేయనున్నారు. ఈ మేరకు ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల వారీగా ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు.. ఓటరు జాబితా తనిఖీలను కూడా పారదర్శకంగా నిర్వహించాలని పేర్కొన్నారు.
Vote is the Strongest Weapon of the People in a Democracy:ప్రజాస్వామ్యంలో ప్రజలకున్న బలమైన ఆయుధం ఓటు. ఎన్నికల్లో ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం విస్తృతంగా కృషి చేస్తోంది. వచ్చే జనవరి 5వ తేదీన ప్రకటించే ఓటర్ల తుది జాబితా ఖరారు చేసే సమయానికి అందులో ఓటరుగా నమోదు కావడంతో పాటు.. ఓటు ఉందా లేదా తనిఖీ చేసుకునేందుకూ అవకాశం కల్పిస్తోంది ఈసీ. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబరు 2, 3న ఈ ప్రత్యేక తనిఖీ శిబిరాలను ఏర్పాటు చేయటంతో పాటు ఇంటింటికీ తిరిగి ఓటర్ల నమోదు, తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టనుంది ఎన్నికల యంత్రాంగం. రాష్ట్రంలో ఫాం 7 ద్వారా దురుద్దేశపూర్వకంగా ఓట్లు తొలగిస్తున్నారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో.. తుది ఓటర్ల జాబితా రూపొందేలోగా జాబితాలో పేరు ఉందో లేదో తనిఖీ చేసుకోవటంతో పాటు కొత్తగా ఓటు నమోదు కోసం కూడా డిసెంబరు 2,3 తేదీలు కీలకం కానున్నాయి.