Skill Development-Inner Ring Road Facts: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసత్యాలకు తెరతీసింది. కళ్ల ముందు బోలెడన్నీ వాస్తవాలు కనిపిస్తున్నా.. అవన్నీ అవాస్తవాలంటూ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం చేస్తోంది. లేనిది ఉన్నట్లుగా.. ఉన్నది లేనట్లుగా మాయాజాలం చేసే ఇంద్రజాలికుల్లా పాలకులు వ్యవహరిస్తున్నారు. అసలు ఉనికిలోనే లేని వాటిని ఉన్నాయంటూ ఉదరగొడుతున్నారు. ప్రతిపక్షాల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తూ.. తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు, అమరావతి రింగు రోడ్డులో అక్రమాలు జరిగాయంటూ.. ఎటువంటి ఆధారాలు లేకపోయినా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేశ్‌లపై సీఐడీ కేసులు నమోదు చేసింది. మరి, అసలు వాస్తవాలు ఏమిటి..? ఎందుకు వైసీపీ ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తోంది..? అని గమనిస్తే పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Illegal Case Against TDP Chief Chandrababu:విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలు నేర్పించి.. వారిని పరిశ్రమలు, కంపెనీల అవసరాలకు తగ్గట్లుగా సానబెట్టేందుకు ఉద్దేశించిన నైపుణ్యాభివృద్ధి శిక్షణలో అవినీతి జరిగిందని.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెబుతోంది. సీఐడీ ద్వారా కేసు నమోదు చేయించి.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేయించి జైలులో పెట్టింది. అంతేకాకుండా, నారా లోకేశ్‌తో పాటు మరికొందరి పేర్లనూ ఈ కేసులో చేర్చింది.
CID on CBN Skill Development Case: ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు..! అంతా సీఐడీ మార్కు కనికట్టు
6 Skill Development Centers in AP:వాస్తవమేంటంటే.. రాష్ట్రంలోని 6 ప్రాంతాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు, మరో 30 విద్యాసంస్థల్లో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కోట్లాది రూపాయల విలువైన పరికరాలు అందుబాటులోకి తెచ్చి.. వేలాది మందికి శిక్షణ ఇచ్చారు. గుంటూరు జిల్లా నంబూరులోని V.V.I.T. ఇంజినీరింగ్ కళాశాలలో సీమెన్స్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రంలో 20 వేల మందికి శిక్షణ ఇచ్చారు. వారిలో 12 వేల మందికిపైగా యువతీ యువకులు.. 20 లక్షల నుంచి 44 లక్షల రూపాయల ప్యాకేజీతో ఉద్యోగాలు పొందారు. వారంతా దేశవిదేశాల్లోని ప్రముఖ సంస్థల్లో పని చేస్తున్నారు. ఇప్పటికీ ఈ కేంద్రంలో కళాశాల విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. కానీ, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలే లేవన్నట్లు వైసీపీ నేతలు, సీఐడీ అధికారులు మాత్రం ప్రచారం మానకపోవటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.