President Draupadi Murmu Visited NISTC: సమాచార, శాస్త్ర సాంకేతిక రంగంలో మహిళలు మరింత ముందంజ వేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో నారాయణమ్మ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలను ఆమె సందర్శించారు. రజతోత్సవాలను జరుపుకుంటున్న మహిళా కళాశాలను సందర్శించడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. స్త్రీలు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారన్నారు.
శాస్త్ర సాంకేతిక రంగంలో మహిళలు మరింత ముందంజ వేయాలి: రాష్ట్రపతి - నేటీ తెలుగు వార్తలు
President Draupadi Murmu visited NISTC: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర పర్యటనలో భాగంగా హైదరాబాద్లోని నారాయణమ్మ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలను సందర్శించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ మహిళా కళాశాలను సందర్శించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. స్త్రీలు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారని, అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా గోల్డ్ మెడల్స్ సాధిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
తాను చాలా విశ్వవిద్యాలయాల స్నాతకోత్సవాలకు వెళ్లానని, అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా గోల్డ్ మెడల్స్ సాధిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. బాలికల పట్ల తల్లిదండ్రులు భేదభావం చూపకూడదని, వారికి అండగా నిలవాలని కోరారు. మహిళలు చదుకోవడం వల్ల సమాజం బాగుపడుతుందన్నారు. అమ్మాయిలు ఉద్యోగం సాధించడమే కాకుండా మరింత మందికి ఉపాధి కల్పించేస్థాయికి ఎదగాలని కోరారు.
ఇవీ చదవండి: