Gold Robbery: గుంటూరు జిల్లా మంగళగిరిలో జ్యూయలరీ షాపు దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. చోరీ ఇంటిదొంగల పనేనని తేల్చారు. పూజా జ్యూయలరీలో పని చేసే మేనేజర్ నరేంద్ర పక్కా పథకం వేసి బంగారం దొంగిలించినట్లు పోలీసుల విచారణలో కనుగొన్నారు. పార్వతీపురం, బొబ్బిలి ప్రాంతాల్లో బంగారు ఆభరణాలు ఇచ్చేందుకు తీసుకెళ్తుండగా.. ఈ నెల 3న రాజమహేంద్రవరం వద్ద చోరీ జరిగింది.
జ్యూయలరీ షాపులో చోరీ.. ఇంటిదొంగల పనే.. - Police cracked
Arrest: సులువుగా డబ్బులు సంపాదించాలనుకున్నాడో ఏమో.. పని చేసే షాపుపైనే కన్నేశాడు. షాపులో పని చేసే ఓ వ్యక్తితో పాటు.. మరికొందరిని రంగంలోకి దించాడు. పక్కా ప్లాన్ ప్రకారం ఆభరణాలు తయారు చేయించేందుకు తీసుకెళ్తున్న బంగారాన్ని చోరీ చేశాడు... పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరిపితే మొత్తం వ్యవహారం బయటపడింది.
బంగారం చోరీ
దుకాణంలో పని చేసే ఓంకార్‌తో పాటు రాజస్థాన్‌కు చెందిన మరికొందరితో కలిసి పథకం ప్రకారం చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. నరేంద్ర సహా మిగిలిన నిందితులను అరెస్ట్ చేశారు. చోరీ చేసిన 1378 గ్రాముల బంగారం విలువ సుమారు రూ.60 లక్షల కు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: