Pensioners Problems : విజయవాడ గాంధీనగర్ సబ్ ట్రెజరీ కార్యాలయంలో పెన్షన్‌దారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగ విరమణ పొందిన వృద్ధులు పింఛను కోసం ప్రతీ ఏటా జీవిత ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు పింఛనుదారులు వేలి ముద్రలు వెయాల్సి ఉంటుంది. ఇందుకోసం గంటల తరబడి క్యూలైన్‌లో వేచిచూడాల్సి వస్తోందని.. కనీస సౌకర్యాలు ఉండటం లేదని వారంతా వాపోతున్నారు. వేలిముద్రలు పడని వారు, ఐరీస్ గుర్తింపు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు వీరు ప్రైవేటు ఆన్‌లైన్ సేవల మీద ఆధారపడాల్సి వస్తుంది.
"ఇక్కడికి వచ్చిన వారు వృద్ధ్యాప్యం మీద పడినవారే. సరైన సౌకర్యాలు లేవు. ఇక్కడ వేలి ముద్రలు ఇవ్వాలంటే క్యూలైన్‌లో నిల్చోవల్సి వస్తోంది. కనీసం కూర్చోటానికి బెంచీలు లేవు. వేలి ముద్రలు రాని వారు ప్రైవేటు సేవల ద్వార ఐరీస్ ఇస్తున్నారు. వారు ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు." - పింఛనుదారు