Cooking Competitions: ఫాస్ట్‌ఫుడ్, జంక్‌ఫుడ్ యుగంలోనూ సంప్రదాయ, ప్రామాణిక వంటల రుచులు అదరగొడుతున్నాయి. " మన రాష్ట్రం మన రుచి" పేరిట నిర్వహిస్తున్న వంటల పోటీల్లో పాల్గొంటున్న వారంతా సంప్రదాయ వంట పద్ధతుల్లో వండిన రుచికరమైన వంటకాలు ఆకట్టుకుంటున్నాయి. మాస్టర్ షెఫ్‌లు సంజయ్ తుమ్మా, రాజు నిర్ణేతలుగా పాల్గొంటున్నారు. విజయవాడలో నిర్వహించిన పోటీల్లో పాల్గొన్నవారు తీసుకొచ్చిన వంటకాలను రుచి చూశారు. ఆహార భద్రతకు అనుసరించాల్సిన పద్ధతులు, వంటల తయారీ మెళకువలను పోటీల్లో పాల్గొన్నవారు..నిర్ణేతలను అడిగి తెలుసుకున్నారు. విభిన్నమైన కొత్తరకం వంటకాలను గుర్తించినట్లు మాస్టర్ షెఫ్‌లు తెలిపారు. మన రాష్ట్రం మన రుచులు కార్యక్రమానికి చక్కటి స్పందన లభిస్తోందని.. ఆనందం వ్యక్తం చేశారు. త్వరలో రాజమహేంద్రవరం, విశాఖలో పోటీలు ఉంటాయని.. అందరూ పాల్గొనాలని కోరారు. అన్ని జిల్లాల్లో విజేతలందరికీ కలిపి వచ్చే నెల 28న విజయవాడలో గ్రాండ్ ఫినాలే జరగనుంది.
కాలాలు మారుతున్నా.. ఆకట్టుకున్న సంప్రదాయ రుచులు..ఎక్కడంటే? - మన రాష్ట్రం మన రుచి
Cooking Competitions: ప్రస్తుతం ఫాస్ట్‌ఫుడ్, జంక్‌ఫుడ్ యుగంలోనూ సంప్రదాయ, ప్రామాణిక వంటలు ఆకట్టుకుంటున్నాయి. మాస్టర్ షెఫ్‌లు సంజయ్ తుమ్మా, రాజు నిర్ణేతలుగా వంటల పోటీలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో జరుగుతున్న ఈ పోటీలకు మంచి స్పందన వస్తోంది.
మాస్టర్ షెఫ్‌లు సంజయ్ తుమ్మా, రాజు