జాతీయ రహదారి విస్తరణలో జాప్యం-కొన్ని ప్రాజెక్ట్‌ల్లో ఒక్క కిలోమీటర్ కూడా పూర్తి చేయని గుత్తేదారు సంస్థలు National Nighways Expansion Delay in AP :రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ పనుల పురోగతి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) సొంత నియోజకవర్గంలోనూ పనులు ముందుకు సాగడం లేదు. వేంపల్లి నుంచి రాయచోటి వరకు జాతీయ రహదారి 440ని విస్తరిస్తున్నారు. 54 కి.మీ.పనులను అంచనా విలువ కంటే 32 శాతం తక్కువకు SRK కన్‌స్ట్రక్షన్స్ దక్కించుకుంది. 440 కోట్లతో మేలో పనులు ప్రారంభించి 20 కిలోమీటర్లు పూర్తి చేసి ఆపేసింది. వచ్చే మే నాటికి మిగిలింది పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు.
National Highway in Andhra Pradesh : కృష్ణా జిల్లా పామర్రు నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడు వరకు NH-165లో 60 కి.మీ.విస్తరణ పనులను వశిష్ట ఇన్‌ఫ్రా (Vashista Infra).. అంచనా కంటే 25 శాతం తక్కువకు దక్కించుకొని జనవరిలో పనులు ప్రారంభించింది. 530 కోట్ల విలువైన పనుల్లో 60 కిలోమీటర్ల కు.. 8 కి.మీ. మాత్రమే పూర్తి చేశారు. వచ్చే జనవరి నాటికి విస్తరణ పూర్తికావలసి ఉండగా, జులై వరకు గడువు పెంచారు. కొన్ని జాతీయ రహదారులు ఒక్క కిలోమీటర్ పూర్తయితే ఒట్టు అన్నట్లుగా ఉంది.
YSRCP Government Neglects National Highway Works: జాతీయ రహదారి పనుల్లో జగన్ సర్కార్ వెనుకబాటు.. నాలుగేళ్లుగా పూర్తికాని భూసేకరణ
NH Situation in Andhra Pradesh :కడప జిల్లా ముదిరెడ్డిపల్లె నుంచి కడప- నెల్లూరు జిల్లాల సరిహద్దు వరకు 36 కి.మీ., అక్కడి నుంచి ప్రకాశం జిల్లాలోని సీఎస్‌పురం వరకు 41 కి.మీ., సీఎస్‌పురం నుంచి మాలకొండ వరకు 44 కి.మీ.. మూడు ప్యాకేజీల్లో పనులను SRK కన్‌స్ట్రక్షన్స్ అంచనా విలువ కంటే 28 నుంచి 35 శాతం వరకు తక్కువకు సొంతం చేసుకుంది. మూడు ప్యాకేజీల్లో కలిపి 121 కి.మీ. మేర 850 కోట్ల విలువైన పనులు గత ఏడాది మొదలయ్యాయి. ఇప్పటికీ ఒక్క కి.మీ. కూడా పూర్తి చేయలేదు. నెలలో పురోగతి లేకపోతే గుత్తేదారును తప్పిస్తామంటూ ఇటీవల మోర్త్ అధికారులు నోటీసిచ్చారు.
Andhra Pradesh Roads :దుత్తలూరు-కావలి మధ్య NH-167 విస్తరణ పనులు అంచనా కంటే 32 శాతం తక్కువకు దక్కించుకున్న TSR సంస్థ సగం మాత్రమే పూర్తి చేసింది. వేర్వేరు కారణాలతో పనులు నిలిపేసింది. వచ్చే జులైకి విస్తరణ అసాధ్యమని చెబుతున్నారు. బళ్లారి వైపు నుంచి గుంతకల్లు మీదుగా గుత్తి వరకు 57 కి.మీ. పనులను 2016లో SRK కన్‌స్ట్రక్షన్స్ చేపట్టింది. 995 కోట్ల విలువైన పనుల్లో 54 కి.మీ. పూర్తి చేశారు. మధ్యలో పలుచోట్ల వంతెనలు అసంపూర్తిగానే ఉన్నాయి. ఇంకా 20 శాతం పనులు జరగాల్సి ఉంది.ఏడున్నరేళ్లుగా సాగదీత కొనసాగుతోంది.
సరైన పరిహారం ఇవ్వకపోతే.. భూములు ఇవ్వమని తేల్చి చెప్పిన రైతులు
మోర్త్‌తో పోలిస్తే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ లో పనులు వేగంగా జరగాల్సి ఉండగా.. వాటికి కూడా గడువు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. విజయవాడ బైపాస్‌లో భాగంగా గొల్లపూడి- కాజ మధ్య నిర్మిస్తున్న 17.88 కి.మీ. ప్యాకేజీలో ఇప్పటికి పూర్తయింది కేవలం 1.29 కి.మీ. మాత్రమే. ప్రాజెక్టు విలువ 1,546 కోట్లు కాగా, ఇందులో 49 శాతం పనులు జరిగాయి. జనవరికల్లా పనులు పూర్తికా వాల్సి ఉంది.
Construction of National Highway in AP :కృష్ణా నదిపై వంతెన నిర్మాణంలో జాప్యం, రాజధాని ప్రాంతంలో కొంత ఎలైన్‌మెంట్ మార్పు కారణంగా ఈ పనులను 2025 ఏప్రిల్‌కు పూర్తిచేయాలని గడువు పొడిగించారు. చిలకలూరిపేట వద్ద ఆరు వరుసల బైపాస్ పనుల్లోనూ ఎడతెగని జాప్యం జరుగుతోంది. 2019 ఫిబ్రవరిలోనే మంజూరైనప్పటికీ భూసేకరణలో జాప్యం కారణంగా ఆలస్యమైంది. ఈ మార్చికే పూర్తికావాల్సిన ఈ ప్రాజెక్టు వచ్చే మార్చికి కానీ అయ్యే సూచనలు కనిపించడం లేదు. ఎన్‌హెచ్-71లో భాగంగా రేణిగుంట-నాయుడుపేట మధ్య 57 కి.మీ. మేర ఆరు వరుసలుగా విస్తరణ పనులు 2020 మేలో మంజూరయ్యాయి. భూసేకరణలో జాప్యంతో పనులు సాగలేదు. 2,238 కోట్ల పనులను గుత్తేదారు 2022 జనవరి నుంచి ప్రారంభించారు. ఇప్పటికి 32 కి.మీ. మేర పూర్తయింది. వచ్చే జనవరికీ పూర్తయ్యే అవకాశాల్లేవు.
అనంతపురం నుంచి గుంటూరు వరకు జాతీయ రహదారి విస్తరణ