ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నన్ను అవమానించారు.. నందిగామ పంచాయతీ చైర్​పర్సన్ ఆవేదన - Mandala Varalakshmi burst into tears

Nandigama Panchayat budget meeting: నందిగామ నగర పంచాయతీ చైర్​పర్సన్ మండల వరలక్ష్మీ కన్నీటి పర్వంతమయ్యారు. నగర పంచాయతీ బడ్జెట్ సమావేశంలో తనకు ఎజెండా కాపీని కూడా ఇవ్వలేదని ఎమ్మెల్యే జగన్‌మోహన్‌రావు ముందు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయం నుంచి తనకు ఏ సమాచారం ఇవ్వకుండా అవమానపరుస్తున్నారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎమ్మెల్యే.. కమిషనర్‌ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత సమావేశాన్ని వాయిదా వేశారు.

Nandigama Panchayat budget meeting
Nandigama Panchayat budget meeting

By

Published : Jan 30, 2023, 5:05 PM IST

Updated : Jan 30, 2023, 5:37 PM IST

Nandigama Panchayat budget meeting: తనను అవమానపరుస్తున్నారని నందిగామ నగర పంచాయతీ చైర్​పర్సన్​ వరలక్ష్మీ స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు సమక్షంలోనే కన్నీటిపర్యంతమయ్యారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నగర పంచాయతీ బడ్జెట్ సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బడ్జెట్ సమావేశంలో కనీసం తనకు ఎజెండా కాపీ ఇవ్వలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. కార్యాలయం నుంచి తనకు కనీస సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో బడ్జెట్ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో టీడీపీ పార్టీ కౌన్సిలర్లు సమావేశం నుంచి వెళ్లిపోయారు.

కార్యాలయంలో ప్రతి విషయంలోనూ తనను అవమానపరుస్తున్నారంటూ ఆమె అన్నారు. సమాచారం ఇచ్చామని, ఎజెండా కాపీ ఇచ్చామని చెప్పిన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎమ్మెల్యే కమిషనర్ జయరాంను, సిబ్బందిని పూర్తి వివరాలు అడిగారు. చైర్​పర్సన్ అనుమతితోనే బడ్జెట్ సమావేశం తేదీ ఖరారు చేసి.. బడ్జెట్ ఎజెండా తయారు చేశామని కమిషనర్ జయరాం వివరణ ఇచ్చారు.

ఎజెండా కాపీని ఆమెకు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉద్యోగులపై వెంటనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జరిగిన పొరపాటున క్షమించి బడ్జెట్ సమావేశాన్ని జరిపించాలని అధికార వైసీపీ కౌన్సిలర్లు కోరారు. టీడీపీ కౌన్సిలర్లు వెళ్లిపోవడం వల్ల లీగల్​గా సమావేశం నిర్వహించడం కుదరదని.. వారు వస్తేనే జరుగుతుందని స్పష్టం చేశారు. దీంతో సమావేశం వాయిదా పడింది.

నన్ను అవమానించారు.. నందిగామ పంచాయతీ చైర్​పర్సన్ ఆవేదన

ఇవీ చదవండి:

Last Updated : Jan 30, 2023, 5:37 PM IST

ABOUT THE AUTHOR

...view details