MP RaghuramakrishnamRaju Hot Comments on YSRCP Govt: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్, రిమాండ్ పట్ల ముఖ్యమంత్రి జగన్, వైఎస్సార్సీపీ మంత్రులు, పోలీసులు, ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరుపై.. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలీసుల పనితీరు వల్ల రాష్ట్రంలో అంతర్యుద్ధం వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి ప్రవర్తన అధ్వానంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ చేస్తున్న అఘాయిత్యాలు, అరాచకాలు, విధ్వంసాలను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దృష్టికి తీసుకువెళ్లానని రఘురామరాజు తెలిపారు.
RaghuramakrishnamRaju Comments: రచ్చబండ కార్యక్రమం ద్వారా ఎంపీ రఘురామరాజు మీడియాతో మాట్లాడుతూ..''స్కిల్ డెవలప్‌మెంట్ స్కీంలో స్కామ్ జరిగిందంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తప్పుడు అభియోగాన్ని మోపి, అరెస్టు చేసి.. జైల్లో పెట్టిన విషయాన్ని రాజ్‌నాథ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లాను. చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేసి, జైలుకు తరలించిన విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలిసింది. రాష్ట్రంలో జమోరె(జగన్మోహన్ రెడ్డి) నేతృత్వంలో జరుగుతున్న అఘాయిత్యాలను రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించాను. ఆయన సావధానంగా విన్నారు. ఆందోళన చెందవద్దు.. న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు'' అని రఘురామరాజు తెలిపారు.
Chandrababu Case Arguments in ACB Court: పోలీసులు నన్ను మానసికంగా వేధించారు.. వాహనంలో తిప్పుతూనే ఉన్నారు
KrishnamRaju Fire on Additional Advocate General: అనంతరం నాసిక్‌లో గంగా నది జన్మించి.. పుణె మీదుగా ప్రవహించిందన్న అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి మాటల మాదిరిగానే.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీంలో ఎటువంటి స్కాం జరగకపోయినప్పటికీ పులివెందుల, కడప బ్యాచ్ చంద్రబాబుపై తప్పుడు కేసు నమోదు చేశారని.. రఘురామరాజు మండిపడ్డారు. చంద్రబాబుపై తప్పుడు కేసు నమోదు చేయమని ఆదేశించినా వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అయితే,.. ఆ వంటకాన్ని అద్భుతమైన దినసులతో వండి వార్చిన వ్యక్తి సీఐడీ చీఫ్ సంజయ్ అని ధ్వజమెత్తారు. రాజ్యాంగ పదవిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి, సీఐడీ చీఫ్ సంజయ్‌లు ఇద్దరు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
Skill Development Case Updates: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఈనెల 22 వరకు చంద్రబాబుకు రిమాండ్
Krishnamraju Hot Comments on CID Chief Sanjay:స్కిల్ డెవలప్‌మెంట్ స్కీములో స్కామ్ జరిగిందని వీరిద్దరూ (సంజయ్, సుధాకర్ రెడ్డి) హైదరాబాదులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం, గతంలో ఒక చానెల్‌లో ప్రసారమైన జోగి బ్రదర్స్ కామెడీ షోను మరిపించిందని..రఘురామరాజు ఎద్దేవా చేశారు. అయినా, హైదరాబాదుకు వెళ్లి మరీ.. అడిషనల్ అడ్వకేట్ జనరల్, సీఐడీ చీఫ్ ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. మీడియా సమావేశంలో వీరిద్దరూ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనని.. గంగానది నాసిక్‌లో పుట్టి పుణె మీదుగా ప్రవహించిందన్న అడిషనల్ అడ్వకేట్ జనరల్.. ఈ కేసు కూడా పుణెలోనే బీజం పోసుకుందన్నారు. గంగానది పుట్టక గురించి తప్పుగా చెప్పి సుధాకర్ రెడ్డి తన జ్ఞానహీనతను, బుద్ధి శూన్యతను ప్రపంచానికి తెలియజేసుకున్నారని రఘురామరాజు పేర్కొన్నారు.
krishnam Raju on Prime Minister Narendra Modi: గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రధాని నరేంద్ర మోదీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌ను అమలు చేశారని.. గుజరాత్‌లో ఎంత అయితే పారదర్శకంగా స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ అమలు జరిగిందో, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి హయాంలోనూ అద్భుతంగా అమలు జరిగిందని.. రఘురామరాజు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యదర్శి హోదాలో నలుగురు అధికారులతో కలిసి ప్రేమ్ చంద్రారెడ్డి వెళ్లి అధ్యయనం చేశారన్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవినీతి చేశారని వేలెత్తి చూపగలరా..?, సూర్యుడి దగ్గరకు వెళ్తే ఎలా మాడి మసైపోతారో.. అలాగే ప్రధానిపై అవినీతి ఆరోపణలు చేస్తే మాడి మసైపోతారని రఘురామరాజు హెచ్చరించారు.
Krishna Raja on CM Jagan Corruption:'గుజరాత్‌కు వెళ్లి అధ్యయనం చేసి వచ్చిన తర్వాత ప్రేమ్ చంద్రారెడ్డి ప్రతిపాదిస్తేనే ఈ స్కీం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏదైనా నేరం జరిగితే ప్రేమ్ చంద్రారెడ్డినే అరెస్టు చేయాలి. ఆయన్ని విచారించి నిజాలు తెలుసుకోవాలి. ఇలా ప్రతి చిన్న విషయానికి ముఖ్యమంత్రిని బాధ్యున్ని చేస్తామంటే.. ఇక ఆ పదవి నిర్వహించడానికి ఎవరు ముందుకు వస్తారు. ముఖ్యమంత్రి తనయుడిగానే జగన్మోహన్ రెడ్డి చేసిన ఆర్థిక నేరాలకు ఆయన్ని శిక్షిస్తే జీవితకాలం సరిపోదు. ముఖ్యమంత్రిగా కేబినెట్ నిర్ణయాలను అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని సర్వం దోచుకున్నారు. వాటిని రేపు అధికారులే అన్ని నిజాలను బయటపెడతారు' అని రఘురామరాజు అన్నారు.
Krishnam Raju on Chandrababu Interm Bail: ఏసీబీ కోర్టులో చంద్రబాబు నాయుడు ఇంట్రీమ్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసినప్పటికీ, ఆయనకు బెయిల్ మంజూరు చేస్తారన్న నమ్మకం తనకు లేదని రఘురామరాజు స్పష్టం చేశారు. కేసు ఎంత క్లియర్‌గా ఉన్నప్పటికీ.. రాజమండ్రి జైలర్ సెలవులపై వెళ్లడం, హౌస్ రిమాండ్ అడిగితే ఇవ్వకపోవడం, జైలర్ స్థానంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బంధువు రవి కిరణ్ రెడ్డి బాధ్యతలను స్వీకరించడం, సబ్ జైలర్‌గా రాష్ట్ర శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు బంధువు రత్నరాజు విధులను నిర్వహిస్తున్న విధానాలను పరిశీలిస్తే.. ఏదో కుట్ర జరుగుతోందన్న అనుమానం కలుగుతుందన్నారు.
టీడీపీ, జనసేన పొత్తుపై జనసైనికులని రెచ్చగొట్టే విధంగా ఒక ఛానల్ కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. ఇప్పటికే పొత్తు ఖరారు అయింది. ఇక మీరెన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం శూన్యం. జనసైనికులను మిస్ లీడ్ చేసే ప్రయత్నాలు మానుకోవాలి. టీడీపీ, జనసేన పొత్తుపై ప్రకటన అనంతరం మొరిగే కుక్కల బ్యాచ్ బయలుదేరింది. అయితే, ఎనిమిది కుక్కలు మొరుగుతాయనుకుంటే,కేవలం నాలుగు కుక్కలు మాత్రమే మీడియా ముందుకు వచ్చి మొరిగాయి.-రఘురామకృష్ణరాజు, ఎంపీ
Chandrababu Naidu Arrested by AP CID : చంద్రబాబు అరెస్టు దేనికి సంకేతం..! ఇప్పుడే ఎందుకు..? వివేకా కేసు దృష్టి మళ్లింపా..? పోలీసులకూ.. కళంకమే!