Dasara Festival Arragemrnts in kanakadurgamma Temple: విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు జరగనున్న దసరా మహోత్సవాలను నిర్వహించేందుకు అధికారులతో దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, దేవాదాయశాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు, రెవెన్యూ, నగరపాలక సంస్థ, ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సెప్టెంబరు 26 నుంచి దసరా మహోత్సవాలు, ఏర్పాట్లకు మంత్రి ఆదేశం - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
Dasara Festival Arrangements విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే దసరా మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సూచించారు. కరోనా వ్యాప్తి తగ్గినందు వల్ల భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అన్నారు.
కోవిడ్ తగ్గుముఖం పట్టిన తరుణంలో ఈ దసరాకు భారీగా భక్తులు తరలి వస్తారనే అంచనా ఉందని.. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి సత్యనారాయణ ఆదేశించారు. దసరా ఉత్సవాల సమయంలో రోజు 30 వేల మందికిపైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని.. మూలా నక్షత్రం రోజున రెండు లక్షల మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. దూరప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని.. ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు. గతంలో వినాయకగుడి నుంచి టోల్ గేట్ ద్వారా కొండపైన ఓం మలుపు వరకు మూడు క్యూలైన్లు ఏర్పాటు చేసేవారని.. ఈసారి ఘాట్ రోడ్డు మొత్తం క్యూలైన్లు ఏర్పాటు చేసి.. వీఐపీలను లిఫ్టుల ద్వారా మాత్రమే అమ్మవారి దర్శనం కోసం అనుమతించేలా సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని చెప్పారు. భక్తులకు ప్రసాదం కొరత లేకుండా అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలని అన్నారు. అన్ని శాఖల అధికారులతో ముందుగానే ట్రయల్‌రన్ నిర్వహించాలని ఆదేశించారు. భక్తులు నదిలో దిగి స్నానం చేయడానికి అనుమతి లేదని తెలిపారు. నది ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నందున షవర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులను ఆదేశించారు.
ఇవి చదవండి: