ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Medico Student Suicide in Guntur వైద్యుడు కావల్సినోడు.. శవంగా మారాడు..! మెడికో ఆత్మహత్యకు ఫీజు పెంపు కారణమా?

Medico Student Kamepalli Venkata Pranav Yashwanth Suicide: గుంటూరు జిల్లాలోని ఓ ప్రముఖ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ విద్యార్థి ఉరి వేసుకోని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు ముందుకు రాసిన ఓ లేఖ వెలుగులోకి రావంటంతో విద్యార్థి ఆత్మహత్యపై వివిద రకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్యకు కాలేజీ యాజమాన్యం కారణమా లేక కుటుంబ కలహాల కారణమా అనే అనుమానాలు వస్తున్నాయి.

Medico Student Kamepalli Venkata Pranav Yashwanth suicide
Medico Student Kamepalli Venkata Pranav Yashwanth suicide

By

Published : Aug 17, 2023, 10:00 AM IST

Medico Student Kamepalli Venkata Pranav Yashwanth Suicide : గుంటూరు జిల్లాలోని ఓ ప్రముఖ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ నాలుగో ఏడాది చదువుతున్న కామేపల్లి వెంకట్ ప్రణవ్ యశ్వంత్.. విజయవాడలోని పటమటలో ఇంటిలో ఉరేసుకుని మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎంబీబీఎస్​లో కొన్ని సబ్జెక్టులు తప్పడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై డిప్రెషన్​తో బాధపడుతున్నాడనీ.. అందుకే జీవితంపై విరక్తి చెంది ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు యశ్వంత్ తాతయ్య ప్రసాద్ పటమట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

Venkata Pranav Yashwanth Commits Suicide With Hanging in Vijayawada :పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడకు చెందిన కామేపల్లి రవికుమార్, నళిని దంపతులు అమెరికాలో వైద్యులు. వీరి కుమారుడు యశ్వంత్ (24) విజయవాడ పటమటలో అమ్మమ్మ, తాతయ్య దగ్గర ఉంటూ వైద్య విద్య చదువుతున్నారు. కొన్ని సబ్జెక్టులు తప్పడంతో మద్యానికి అలవాటుపడి మానసిక సమస్యతో బాధపడుతూ.. వైద్యుడి వద్ద చికిత్స పొందుతున్నాడు. ఈ నెల 14న రాత్రి భోజనం చేసి తన గదికి వెళ్లి పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం గది తలుపులు తెరిచి చూడగా బెడ్​ షీట్​తో ఫ్యాన్​కు ఉరేసుకుని ఉన్నాడు. అతడి తాతయ్య ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శాతకర్ణి తెలిపారు.

Inter Student Suicide: కాలేజీ మారినా ఆగని వేధింపులు.. ఇంటర్​ విద్యార్థిని బలవన్మరణం

రెండు నెలల కిందట ప్రిన్సిపల్ పై ఫిర్యాదు:యశ్వంత్ ఈ ఏడాది జూన్ 21న సదరు కళాశాల ప్రిన్సిపల్​పై విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్​కు ఫిర్యాదు చేశాడు. ఈ లేఖ ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. 2019లో మేనేజ్మెంట్ కోటాలో తాను కళాశాలలో చేరినప్పుడు ఏటా 33 లక్షల రూపాయలు ఫీజు నిర్ణయించారనీ.. దానిని చెల్లిస్తూ వస్తున్నానన్నాడు. కానీ.. అదనంగా మరో 12 లక్షల రూపాయలు కట్టాలనడంతో, తాను చెల్లించలేనని ప్రిన్సిపల్​కు చెప్పానన్నారు.

అయితే.. ఈ విషయంలో ప్రిన్సిపల్ తోటి విద్యార్థుల ముందు తనను అవమానించారనీ, అదనపు ఫీజు చెల్లించకపోతే చర్యలు తీసుకుంటా మంటున్నారని యశ్వంత్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై కళాశాల అడ్మినిస్ట్రేటర్​తో మాట్లాడేందుకు ప్రయత్నించిగా.. కుదరలేదన్నాడు. ఈ ఫిర్యాదు వెలుగులోకి రావడంతో ఫీజు విషయంలోఒత్తిడి వల్లే యశ్వంత్ చనిపోయాడని ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది.

ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య కేసు.. నలుగురు నిందితులు అరెస్టు

దీనిపై ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ రాధికారెడ్డిని వివరణ కోరగా.. ఫీజు విషయంలో యశ్వంత్ జూన్ 23న ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనన్నారు. దీనిపై యాజమాన్యాన్ని తాను వివరణ కోరగా.. వారం వ్యవధిలోనే వారు స్పందించి.. ఫీజుల విషయంలో ఏ వివాదం లేదని తెలిపారన్నారు. కళాశాల తరగతులకు కూడా యశ్వంత్ హాజరవుతున్నాడని ప్రిన్సిపల్ తెలిపారని రాధికారెడ్డి వెల్లడించారు.

Suicide బస్సు ఫీజు కట్టలేక ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య.. శోకసంద్రంలో తల్లిదండ్రులు

యశ్వంత్ మృతికి, తమ కళాశాలకు ఎలాంటి సంబంధం లేదని కళాశాల యాజమాన్యం పేర్కొంది. 'ఫీజులు చెల్లించాలని అందరు విద్యార్థులను కోరినట్లే అతడిని అడిగామే తప్ప ప్రత్యేకించి ఒత్తిడి చేయలేదు. గత వారం కూడా అతను తరగతులకు హాజరయ్యాడు. ఫీజుల విషయమై జూన్​లో విద్యార్థి హెల్త్ వర్సిటీకి ఫిర్యాదు చేయగా దానిపై వర్సిటీ మా వివరణ కోరింది. తను చేసిన ప్రతి చెల్లింపును ఆధారసహితంగా నివేదించాం. మా తప్పు ఉంటే ఇప్పటికే మాపై వర్సిటీ చర్యలు తీసుకునేది కదా? అతను చనిపోయింది. ఇంట్లోనే. కారణాలు కుటుంబీకులకే తెలియాలి. ఇంట్లో చనిపోతే కారణాలేంటో మాకెలా తెలుస్తాయి. కళాశాల వ్యవహారాలు సుప్రీంకోర్టు పరిథిలో ఉన్నాయని చెప్పి ఏం జరిగినా కళాశాలకు ఆపాదిస్తున్నారు. ఇది సరికాదు' అని యాజమాన్యం పేర్కొంది.

ఐఐటీ మద్రాస్​లో ఏపీ విద్యార్థి ఆత్మహత్య.. కారణమేంటి..?

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details